tag:blogger.com,1999:blog-56393869978909018012023-12-06T01:45:47.913+05:30ఓ చిన్న మాట.....Expressing my heart feelings[Manasu Palike O chinna maata] in the form of poetry in my mother tongue ...Telugu. [ Kavitha, manasu, kavithalu, kavita, blog, blogu, poetry, bhaavaalu]Unknownnoreply@blogger.comBlogger123125tag:blogger.com,1999:blog-5639386997890901801.post-18135633886113107212016-09-10T12:05:00.001+05:302016-09-10T12:05:51.132+05:30రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అమ్మేశారురాష్ట్రాన్ని ప్రత్యేకంగా అమ్మేశారు

నోట్లకి కొంత

ఓట్లకి కొంత

కాళ్ళక్రింద దూరే బానిసత్వానికి అంతా!!

ఆత్మ గౌరవం లేదు

ఆవకాయ పచ్చడి లేదు

నరంలేని నాయకులుంటే రాష్ట్రం నాశనమే!!

రక్తం మరిగిందని

ఇరవై సార్లు వెళ్ళి కలిశానని

ప్రత్యేకహోదా మాత్రమే కావాలని ప్రజలతో వంతపాడి

ఇచ్చినంతా తీసుకోక ఎంచేద్దామన్నప్పుడే

నీ మేక తోలు ఊడిపొయింది!!

చేతకాకపోతే దిగిపోవచ్చు

చేతనైతే ఎదుర్కొనవచ్చు

రెండిటికీ కాక

చేష్టలుడిగిన నీ మేకపోతు గాంభీర్యం

మమ్మల్ని పగలబడి నవ్వేలా చేస్తూంది!!

విభజన పై ఇచ్చిన ప్రజా తీర్పులో

ఒక రాజకీయవర్గం మాడి మసైపోయింది

కేంద్రం భజన చేస్తూ వారి తొత్తులామారిన

మీ వర్గం మరో తీర్పుతో దిగంతాలకేగుతుంది!!

రాష్ట్రమేమైనా పర్లేదు

నా కుర్చీ ఉండాలి

నేను క్షేమంగా ఉండాలనే

నీ ఆశయం ప్రజలపై రుద్దకు

ఎందుకంటే నిన్ను ప్రజలు రేవుకేస్తారు

ప్రతేకహోదా సబ్బుతో ఉతుకుతారు !!

Unknownnoreply@blogger.com3tag:blogger.com,1999:blog-5639386997890901801.post-30241316758227352502016-09-04T20:42:00.003+05:302016-09-05T10:03:45.419+05:30మరి ఎక్కడ మన అత్మ గౌరవం?అప్పుడు విభజించద్దంటూ మోకరిల్లి

ఇప్పుడు నిధులకై తల్లడిల్లి

కేంద్రం ముందు బిచ్చమెత్తుకుంటుంటే

మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

బొంకయ్యల పిచ్చి కూతలు

బోడీల వాగ్ధానపు బూటకాలు

బాబులు నడిపిస్తున్న నాటకాలు

రెండేండ్లు ఆ బురదలో పొర్లి పొంగిపోతుంటే

మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

విభజన ఆపలేక

రాజధానికి దిక్కులేక

నడిదారిలో నిలిపిన

ఈ రాజకీయ రొచ్చులో రగిలిపోతుంటే

మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

విభజన ఆపలేనప్పుడే తెలిసింది

మన ఆరంభ శూరత్వం

ఇప్పుడు ప్రత్యెకహోదాకై ఏం పీకలేని

మహా గొప్ప వారసత్వం

మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

త్రుప్పు పట్టిన ఆయుధాలు ఏమి లేపుతారులే

కప్పు కింద కూర్చుని పప్పు ఆరగిద్దాం

తెలుగు లేదు వెలుగు లేదు

ఊరు లేని పేరు లేని

నిలువ నీడలేని రాజధాని మనది

మరి ఎక్కడ మన అత్మ గౌరవం?

ఇచ్చిందేదో చాలని

మూసుకొని వుందాం

మనకు మాటలెక్కువ

పట్టుదల తక్కువ

మనం చేసే పనికిమాలిన పోరాటంతో

ఉన్నదీ ఊడుతుంది ఉంచుకున్నదీ పోతుంది

కొంచెం మడిచి ఎత్తిపెట్టు మన అత్మ గౌరవం!!

క్షమించండి గుండె రగిలిపోతుంది మనల్ని వీరు ఆడుకుంటున్న తీరు చూస్తుంటేUnknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-5639386997890901801.post-64289105476091050152016-04-08T12:12:00.000+05:302016-04-08T12:13:42.504+05:30శ్రీ దుర్ముఖి నామ యుగాది శుభాకాంక్షలతోనిదురలో పలుకునది తెలుగు

చివుక్కుమన్న మనసు ఒలికేది తెలుగు

బాల్య స్నేహితుని పలుకరింప వచ్చేది తెలుగు

సంభ్రమాశ్చర్యాన గొంతునూరేది తెలుగు

మాతృభాష మనదన్న భాష

ఏబది ఆరు అక్షరాల శబ్ద సంకలన మాల

భావ వ్యక్తీకరణకు సర్వ శబ్దములొక్కచోట చేరిన సాహిత్యపు సిరి వెన్నెల

ముప్పది రెండు వేల అన్నమయ్య కీర్తనల శొభాయమాన

సంగీత రసమయ ఇంద్రనీల

మన పలుకు మూలమ్ము తెలుగు

శతబ్దాల సంప్రదాయ వాహిని తెలుగు

ప్రపంచమంతా విస్తరించిన తెలుగువాడి జీవనాడి తెలుగు

పల్కినకొద్దీ తేనెలూరు

చదివినకొద్దీ చైతన్యమొనరు

వ్రాసినకొద్దీ కథ కవితలూరు

మహా వటవృక్షమ్ము తెలుగు

నేటి తరానికి నేర్పిస్తే సంస్కారం పెరుగుతుంది

రేపటి తరానికి నేర్పిస్తే సంస్కృతి మిగులుతుంది

భవిష్యత్తు తరాలకి నేర్పిస్తే నా జాతన్న తీయని భావన వెలుగుతూనే ఉంటుంది

యుగాది కాలంతరాలు దాటి పయనిస్తూనేఉంటుంది

అందమైన తెలుగు

సుందరమైన తెలుగు

వేమన శుమతీ నీతుల తెలుగు

పోతన వండిన భాగవతపు తెలుగు

తిక్కన నన్నయ యఱ్ఱనల భారతపు తెలుగు

రాయల ఆముక్త మాల్యదలో నిండిన తెలుగు

కృష్ణ శాస్త్రి కవితలలో ఊయలలూగిన తెలుగు

ఎంకి పాటలలోని తెలుగు

శ్రీశ్రీ కలాన దున్నిన తెలుగు

శ్రీనాధ కవిని సార్వభౌముని చెసిన తెలుగు

మహా మహోన్నత భాష మన తెలుగుUnknownnoreply@blogger.com3tag:blogger.com,1999:blog-5639386997890901801.post-77822247828471892852016-01-19T11:10:00.001+05:302016-01-19T12:30:57.816+05:30ప్రాంతీయతత్వం మత్తు గొప్పదో కాదో కాని....ప్రాంతీయతత్వం మత్తు గొప్పదో కాదో కాని

మనకు దారి చూపిన గొప్ప నాయకులను

గౌరవించలేని నీచ సంస్కృతి మాత్రం గొప్పది కాదు

తెలుగు వాడి వేడి ప్రపంచానికి చూపింది రామన్న

తెలుగు వారి ఆత్మ గౌరవం గుర్తు చేసింది రామన్న

తెలుగు వారి ప్రియతమ నాయకుడికి నీవందిస్తున్న ద్రోహ నివాళి

ప్రజలందరూ గమనిస్తున్నారు నీ సంకుచిత సరళి

రాజకీయ ప్రస్థానానికి నాంది పలికింది ఆ చేతుల మీదుగానే

భవిష్యత్తు దిద్దుకుంది ఆ నాయకత్వంలోనే

కాని నమ్మకద్రోహానికి మారుపేరు నీవు

కుంచిత మనస్తత్వానికి అసలు రూపు నీవు

విభజన ముందు సిగ్గు శరం లేనోళ్ళు అంధ్రోళ్ళన్నావు

నీచమైన పదాలతో దుమ్మెత్తిపోశావు

ఎన్నికలనగానే కాలి ముల్లును పంటితో తీస్తామన్నావు

వంచిత మనస్తత్వానికి బహురూపం నీవు

పత్రికలని మాధ్యమాల్ని అణచివేస్తూ

నియంత లక్షణాలు నిలువెల్లా చూపిస్తూ

నిర్ణయాలు నవ్వులపాలు కాగా నిచ్చేష్టుడవౌతూ

కుఠిల రాజకీయాల కుళ్ళు కంపు నీవు

అధికారం మూన్నాళ్ళ ముచ్చటే

పుచ్చు పదాల ఉచ్చు మాటలకు ప్రజలు పడిపోరు

బంధు జనాల నీ ఊరేగింపు ఎన్నళ్ళూ సాగుతుంది

పొగరు మాటల కండకావరం త్వరలోనే కొడిగడుతుంది

Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-5639386997890901801.post-31400204696776560212016-01-05T10:19:00.000+05:302016-01-05T10:19:54.636+05:30తెలుగును ఉరితీస్తున్నారు రక్షించండి

మాతృభాష మరువకుండా

తెలుగు మాట అంతరించిపోకుండా

నిండుగా గుండెల్లో ఉండాలని

పరాయి రాష్ట్రంలో ఉన్నా

తమ పిల్లలకి తెలుగు నేర్పుతుంటే

తమిళ భాషే నేర్చుకోవాలంటూ

వారి భాషే బ్రతకాలంటూ

వ్యాధి శోకిన కొందరు

సుందర తెలుంగు విలువ తెలియని కొందరు

వందల ఏళ్ళుగా సమాజ నిర్మాణంలో

పాలుపంచుకున్నామని విస్మరించిన కొందరు

తెలుగు భాషను ఉరితీస్తున్నారు

విద్యార్థుల్ని బలవంతంగా

తమ భాషలోనే చదవాలంటూ

ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వం రుచి చూపిస్తున్నారు

నిర్భంధంగా సమూలంగా తెలుగును తొలగిస్తున్నారు

న్యాయస్థాన తీర్పునే పరిహసిస్తున్నారు

పరీక్షలొచ్చే వేళ పైశాచికం ప్రబలిస్తున్నారు

తమిళవారు అంధ్రదేశంలోనూ ఉన్నారు

తమ భాషను ఆనందంగా అభ్యసిస్తున్నారు

ఎందుకు వారికి ఈ పైత్యం అంటిందో

తెలుగు భాషను ఉరితీస్తున్నారు

అంధ్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తే

ఏమి తెలియనట్లు అమాయకంగా వెళ్ళిపోయాడు

తెలుగు దేశమంటాడు

ప్రపంచంలోని తెలుగువాళ్ళందరూ తనవాళ్ళంటాడు

మరి అక్కడ తెలుగు భాషను ఉరితీస్తుంటే చోద్యం చూస్తున్నాడు

తెలుగు బ్రతకాలి

భావాల బంధాల వారధియై తులతూగుతుండాలి

పుడమి పై తెలుగు మాటలు తేనెలూరుతుండాలి

భాష పరంపర తర తరాలకు కొనసాగాలి

కాని...తెలుగును ఉరితీస్తున్నారు తమిళనాట...రక్షించండిUnknownnoreply@blogger.com4tag:blogger.com,1999:blog-5639386997890901801.post-72214024450136193232015-12-29T13:57:00.000+05:302015-12-29T13:57:07.698+05:30కాస్త కళ్ళు తెరువు బాబుముందుకెళ్తున్నానంటూ పరుగులెడుతున్నావు

మరి వెంట ప్రజలున్నారా చూసుకో బాబు

అతి వేగం ప్రమాదకరం

ఫలితమివ్వని సంస్కరణలు పరిహాసమౌతాయి బాబు

చేసేస్తున్నామంటే సరిపోదు

ప్రజల అవసరం తీరిందా అనేదే ప్రశ్న

పథకాలు ప్రకటించడంతోనే బాధ్యత పూర్తవ్వదు

పేదల కడుపునిండుతున్నదా విలువెంచుకో బాబు

సహచరులను వెనెకేసుకురావడం కనిపిస్తూనే ఉంది

స్వచ్ఛత పై పడే మచ్చల జాబితా పెరుగుతూనే ఉంది

క్రొవ్వు పట్టిన మద గజాల కంపు పెరుగుతూనే ఉంది

స్వచ్చ ఆంధ్రప్రదేశ్ జాబితాలో మనుషుల్ని మరి మనసుల్ని

కాస్త చేర్చుకో బాబు

పిల్లి కళ్ళు మూసుకుని...అన్నట్లు

ప్రతిపక్షం మీదనే అంతా రుద్దేస్తే సరిపోదు

మీకు అంటుతున్న మసి మాసిపోదు

కాస్త కళ్ళు తెరువు బాబు

అద్భుతమైన అలోచనలుంటేనే సరిపోదు

ఆచరణలో కూడ కనిపిస్తేనే

చివరి వరకూ కొనసాగిస్తేనే

ప్రజల మన్ననలు అందుతాయి బాబు

Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-5639386997890901801.post-88539535007618671852015-12-22T23:17:00.001+05:302015-12-22T23:17:56.733+05:30ఓ వడ్డీల మహరాజుపిలిస్తే డబ్బులిస్తామంటూ

రోజువారీ వడ్డీ ఇస్తూ రోజు గడుపుకోమంటూ

అప్పులిచ్చి గుప్పెడంత ఆశనిచ్చాడు

ఓ వడ్డీల మహరాజు

భూమి పత్రం కావాలంటున్నాడు

పుస్తె పసిడి తెచ్చివ్వమంటున్నాడు

దొరికిన కొద్దీ దోచుకుంటున్నాడు

అవసరం తీర్చమంటున్నాడు

ఈ వడ్డీల మహరాజు

పొరపాటు తెలిసినా

గ్రహపాటు తప్పలేదు

అప్పు తీర్చలేక

తప్పు సరిచేయలేక

ఇల్లమ్మి భూములమ్మి

కట్టు బట్టలతో బయటికీడ్చాడు

ఆ వడ్డీల రారాజు!!

లెక్కలు గుక్క తిప్పుకోకుండా

చెబుతున్నడీరోజు

అప్పు నిప్పై తలమీద కూర్చుంటే

పగబట్టిన త్రాచై మీదకురుకుతున్నాడు వడ్డీల రారాజు

ఉసురు తీసుకోకముందే

ఈ కోరలకు బలికాకముందే

గుండెల్లోని బాధ కంఠంలో పొలికేకవ్వగ తిరగబడు

మగ్గుతున్న తలవొగ్గుతున్న ప్రజలని చైతన్య పరుచు

సమాజం నుండి వెలివేయి ఈ రక్త పిశచుల్ని

స్వంత కుటుంబమే ఈసడించుకోవాలి ఈ మానవ మృగాలని

ఈ కౄరమైన ఆటకి అదే ముగింపు తమ్ముడూ

Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-5639386997890901801.post-45501202203389391022015-12-21T22:03:00.002+05:302015-12-21T22:04:56.800+05:30నీ ప్రేమను కొంచెం కొంచెం రుచి చూపిస్తూనే ఉంది....చిరుగుల జ్ఞాపకాలలో

చివరికి మిగిలింది

చనువుతో తాకిన

నీ మది గానమే

ఎండల ఈ వేసవి వెంటే ఉంది

కబురులు చెప్పక

కర్కశపు క్షణాలు తెచ్చింది

గుండెను కోత కోసింది

ఎరగా నను వేసి

నిన్ను కాజేసింది

రంగుల దుప్పటి నాపై కప్పి

కాలం కనుమరుగయ్యింది

కాలాలను దాటి

కలలు వెంటాడుతున్నాయి

తలుపులు మూసిన నీ తలపులపై వ్రాసిన

విరహపు కవితలు

రెప్పకు చెప్పక

చప్పున గుండెలోతుల్లోకి ఇంకిపోయాయి

మన ఇళ్ళ మధ్య అల్లుకున్న

సన్న జాజి తీగ మాత్రం

గుప్పెళ్ళతో పూవులు గుమ్మరిస్తూ

నీ ప్రేమను కొంచెం కొంచెం రుచి చూపిస్తూనే ఉంది

Unknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-5639386997890901801.post-11142050493476923192015-06-26T10:44:00.000+05:302015-06-26T10:44:30.598+05:30నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలుఅక్షర బానిసత్వం అణువణువునా నిర్వచిస్తూ
కలానికి సంకెళ్ళు వేసి
స్వేచ్ఛా భావాలని అణిచివేసి
రాజకీయాలకు లొంగిపోతూ
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

స్వంత ప్రచారానికి వాడుకుంటూ
రాజకీయ నాయకుల పుత్రికలై
సొంత బాక ఊదుకునే వేదికలై
స్వేచ్ఛను కాలదన్ని అచేతనమై
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

నిజాన్ని పాతరేసిన
వక్ర ధోరణుల
వికృత వ్రాతల
కర దీపికలు - పత్రికలు
బుల్లితెర స్వార్థ వాహికలు - మాధ్యమాలు
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

నాయకుల కొమ్ము కాస్తూ
వారి పంచనే పడగలు పెంచుకుంటూ
అధికారానికి అర్ధాంగిగామారి
వార్తలకు బదులు కట్టుకథలు అల్లేస్తూ
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

ప్రజలకు నిక్కచ్చి సమాచారమందించాల్సిన
ప్రధాన బాధ్యతను విస్మరించి
వ్యాపార సూత్రాలను వల్లెవేస్తూ
నికృష్ట రాజకీయాలు వంటబట్టి
బుల్లితెరలపై ప్రజలకు అబద్ధాలు నూరిపోస్తూ
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

ప్రజలకు తెలుసు ఏ పత్రిక ఎవరికి కొమ్ముకాస్తుందో
ప్రజలకు తెలుసు ఏ మాధ్యమం ఎవరిని ఆకశానికెత్తేస్తుందో
ఎవరు భ్రమలో ఉన్నారు?
ఎవరు నీచ సంస్కృతిని ఎగదోస్తున్నారు?
నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు

తగులబెట్టండి ఇటువంటి పత్రికల్నీ మాధ్యమాల్ని
విషసంస్కృతిని ప్రజలపై రుద్దకుండా
తిరిగి ఈ సర్పాలు మొలవకుండా
సమాజాన్ని శాసిస్తున్నామనుకోకుండా
తగిన శాస్తి చేయండి
ఎంత నిర్లజ్జగా మన పత్రికలూ, మాధ్యమాలు?!!

Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-32375099905721191042015-06-08T11:15:00.000+05:302015-06-08T11:15:24.693+05:30దాశరధి తెలుగువారి సాహిత్య రథ సారధిదాశరథి, తెలుగువారి సాహిత్య రథ సారధి

ఎనబది ఏండ్ల సాహితీ వారధి

విలక్షణ రచనల పెన్నిధి

తన పయనంలో

తెలంగాణ మాండలీకంతో

తెలుగు మోదుగుపూలు పూయిస్తూ

తెలంగాణ పోరాటాల్ని

అక్షరీకరిస్తూ

తెలుగు సాహిత్య పరిమళాలకు

నిత్యశోభనిస్తూ

చిల్లరదేవుళ్ళ సమాజాన్ని

కళ్ళకు కడుతూ

నిజాము నెదిరించి

జనపదమునకు అక్షరజీవంపోస్తూ

కావ్యాలను అనువదిస్తూ

దివికేగిన రంగాచార్యులకు

ఇది మా తెలుగు వారి భాష్పాంజలిUnknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-4896951346139452042015-06-08T10:25:00.000+05:302015-06-08T10:25:27.905+05:30కుళ్ళిన నాయకులని సంతల్లో కొనేస్తూకుట్రలు కుతంత్రాల

నాయకులు

కుళ్ళబొడుచుకుంటున్న వైనం

కళ్ళారా చూస్తున్నాం

రోతపనుల ఈ రోగగ్రస్తులని

పాలించరా అని గద్దెనెక్కిస్తే

నిక్కి నీలిగి

ప్రజా పాలన వదిలేసి

రహదారి పై కుక్కల్లాగ

పోట్లాడుకుంటూ

నక్క జిత్తుల తెలివి తేటలన్నీ

ఒకరిపై మరొకరి నాశనానికి

ఉపయోగిస్తూ

కట్టల కట్టలు డబ్బులు

వెదజెల్లుతూ

ప్రజలను వెర్రి వెధవల్ని

చేసే ప్రయత్నంలో విజయం

సాధించినట్లు విఱ్ఱవీగుతున్నారు

కృతజ్ఞతకు బదులు

ప్రజలకు కృతఘ్నులుగా మారుతున్నారు

విచక్షణలేని వికృతత్వాన్ని

తలకెక్కించుకున్నారు

విడిపోయినా

తమ ప్రాంత బాగోగులు చూసుకోక

కుఠిల రాజనీతులపై

సమయం వెచ్చిస్తూ

కుళ్ళిన నాయకులని సంతల్లో కొనేస్తూ

సాగే ఈ దుష్టయజ్ఞం ఎన్నాళ్ళు?

దొరికిన దొంగలు కొందరే

దొరకని దొంగల దాగుడుమూతలు మరెన్నాళ్ళు?Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-35065666014923164852015-06-02T18:50:00.001+05:302015-06-02T18:55:09.592+05:30వచ్చిందిర తెలంగాణ!!

జన గర్జన

పెల్లుకుబికి

పోరాటం

నింగికెగసి

ఉడుకుడుకు నెత్తురుల

ఉరుకులెత్తి

వచ్చిందిర తెలంగాణ!!

పిడికిలి బిగించి

ప్రాణం తెగించి

గళ హోరుగ

జన వేదన

రగిలించిన

అగ్గి గోళమై

శివాలెత్తగ

వచ్చిందిర తెలంగాణ!!

బలిదానపు

విద్యార్థులు

అలుపెరగని

ఉద్యోగులు

ఉద్యమమై సాగగ

కొత్త ఉదయమై

వచ్చిందిర తెలంగాణ!!

ఒక్క తాటిపై

ఒక్క రూపమై

సంధించిన బాణమై

నిదురించని నినాదమై

ఎరుపెక్కిన తూరుపున

వచ్చిందిర తెలంగాణ!!

పల్లె పల్లెన

సయ్యంటూ

పిల్ల పాపలు

జై అంటూ

పాట పదునెక్కి

జనవేడుక కదను త్రొక్కగ

జగమెల్లా స్వాగతము పలుక

వచ్చిందిర తెలంగాణ!!

Unknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-5639386997890901801.post-92012001006246876572015-05-30T11:51:00.000+05:302015-05-30T11:52:59.735+05:30ఇవీ మన తలరాతలునేతల

కోతలు

మోతలు మోతలు

వెఱ్ఱి కూతలు!

రోత

మూతుల

ఆబోతుల

బూతులు

ఇవీ మన తలరాతలు!!

జోతల

చేతలు

జేబున

కాసుల పేరులు

వాహన వరుసలు

అడ్డదారిన ఆదాయాలు!!

వెతల

కతలు

రైతుల

కనుమూతలు

సామాన్యుని

ఆకలి చావులు

తరతరాలకు

తలవంపులు!!

గోతులు

త్రవ్వే

ఈ జిత్తులమారులు

చేతలు ఉడిగిన

అచేతనులు

అధికార మదాంధ

వ్యసనపరులు!!

Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-44452204664072706262015-05-06T20:21:00.000+05:302015-05-09T18:01:21.726+05:30ఉద్యమ నేతలు పదవికాశ పడితే...ఉద్యమ నేతలు పదవికాశ పడితే

ఉద్యమమే ప్రక్క దారి పడితే

పిడికిలి బిగించి

ప్రాణాలకు తెగించి

వెంట నడచిన

వేకువ వెదకిన

ప్రజలేమౌతారు?

వంచన పంచన

కూర్చొని

బేరసారాలు

కుదుర్చుకొని

బందువులను

రాబందులను

గద్దెనెక్కిస్తే

ప్రజలేమౌతారు

నా దారి వేరంటూ

ఉద్యమం ఒదిలేసి

వెంటనడచిన వారి

నోళ్ళు మూయించి

పోరు బాటలు మరచి

మాటలకే పరిమితమైతే

కోటలకే దాసోహమంటే

స్వార్థం నరనరానా పాకుతుంటే

ప్రజలేమౌతారు?

నిప్పుల ఉప్పెనలౌతారు

నిశ్శబ్ద జల ప్రళయాలౌతారు

గర్జించే అగ్ని పర్వతాలౌతారు

పట్టిన చిలుమును

పెరిగిన కలిమిని

పట్టిన త్రుప్పును

పేరిన ధూళిని

ప్రజలు కడిగేస్తారు

కోటని

తోటని

పదవిని

బలిమిని

అర్థాన్ని

స్వార్థాన్ని

ప్రజలు కూల్చేస్తారు

Unknownnoreply@blogger.com4tag:blogger.com,1999:blog-5639386997890901801.post-47679630128280153732015-05-03T19:56:00.000+05:302015-05-03T19:56:23.396+05:30ఆంధ్ర తెలంగాణ అభిప్రాయ భేదాలుప్రాంతాల విభేదం వచ్చిన తరువాత

నీది నాదన్న వాదనలోకి అడుగు పెట్టాక

ఎవరి అడుగులూ వెనుకకి పడవు

కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

కటువు మాటలు కట్టిపెట్టండి

నిన్న మొన్నటిదాక మనం నేస్తాలం

కుటుంబ స్నేహితులం, ఇరుగు పొరుగులం

ఎవరూ వారికి చెందని ప్రాంతంలో ఉండాలనుకోరు

కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

అంతలోనే శత్రువులంటూ దొంగలంటూ దూషించి

ఈసడింపు మాటలకు వెకిలి చేష్టలకు తావివ్వకండి

నిన్నటి స్నేహితుడు నేడు శత్రువంటే మానవత్వం విరగబడి నవ్వుతుంది

కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

ఉద్యోగులైనా, న్యాయస్థానమైన ఎవరికి వారుగా

నేడైనా రేపైనా విడవలసినదే

తమ ప్రాంతానికి తరలవల్సినదే

అవమానించి అపహాస్యం చేయవల్సిన అవసరం లేదు

కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

కొన్ని రోజుల ప్రశాంతత ఓపికా అన్నీ సరిపెడుతుంది

రాజకీయ బురద పోట్లాటలాపి కళ్ళు తెరవండి

అంతలోనే గగ్గోలుపెట్టి గర్వం ప్రదర్శించకండి

మీ ప్రాంతం మీద మీకెంత మక్కువో వారి ప్రాతం మీద వారికంతే

మక్కువ ఉంటుందని గుర్తెరగండి

కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

రాకాసి రాజకీయం రంగు రంగు రూపాల్లో వస్తుంది

కొంపలు మునిగిపొయాయంటుంది,

అంతా వారి వల్లే జరిగిందంటుంది

తప్పులు కప్పిపుచ్చుకోటానికి ప్రతి అవకాశం వినియోగిస్తుంది

ఆ మత్తులో కొట్టుకుపోకండి

ఎవరి రాజకీయాలూ ఎక్కువరోజులు పనిచేయవు

నిజం నిక్కచ్చిగ నక్కల తోలు ఒలిచేస్తుంది

కాలం కసిగా వారిని పాదాల క్రింద నలిపేస్తుంది

ఇవి కదిలిపొయే మబ్బులు

కక్ష కార్పణ్యాలకు లొంగిపోకండి

జీవిత నేస్తాలను ఒదులుకోకండి

న్యాయం జరిగే తీరుతుంది

కావల్సింది ఇరువైపులా కాస్తంత ఓపిక

Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-46390888804833853062015-05-03T19:06:00.000+05:302015-05-03T19:06:53.742+05:30చెమట చుక్కల పురిటి నొప్పులుపనిముట్టుల

కనికట్టులు

చెమట చుక్కల

పురిటి నొప్పులు

వెట్టి చాకిరి

తిరుగుబాట్లు

మురికి పట్టిన

పని బట్టలు

తట్టిలేపిన

ఆకలి కేకలు

చుట్టు ముట్టిన

అప్పుల బాధలు

ఉట్టిన మిగిలే ఆశలు

ఉత్తిగ రాలే జీవితాలు

మట్టిన కలిసే జాతకాలు

మేం చవి చూశాము

చెమట కరగందే

రోజు గడవదు

పోరాటమెరగందే

న్యాయం జరగదు

వందలు వేలు పనిచేస్తున్నా

ఒక్కడిక్రిందే బానిసలు

కదిలే ఇనుప చక్రాలు

కరగని రక్త పిపాసులు

బ్రతిమిలాడి

భంగపడి

పనికి తాళమేసి

మెరుపు సమ్మెలు

చేత ఎరుపు జెండాలు

ఇంట కడుపు కోతలు

భటుల కఱ్ఱ దెబ్బలు

దేహాన రక్తపు కాల్వలు

నిరాహార దీక్షలు

నిర్యాణ పర్యవసనాలు

మేము చవి చూశాము

జీవితాలను ఒడగట్టి

కొడగట్టి

కన్నీట ఒకరికి ఒకరై

తోడున్నాము

సంఘటిత శక్తులై మేల్కొన్నాము

ఒక్క పిడికిలితో

ఉక్కు పిడికిలితో

ప్రపంచానికి

క్రొత్త సూర్యుడిని రుచి చూపించాము

మేము కార్మికులం

గమ్యాలకు చేర్చే నావికులం

నిరాశ నిస్పృహలను

పధ ఘట్టనల క్రింద

త్రొక్కి తుత్తునియలు చేశాము

ఎర్ర సలాముల త్యాగ ధనులను

చూశాము

కార్మికలోకపు ఐకమత్యం

మేం చవి చూశాము

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-65962787432316432772015-05-01T18:35:00.000+05:302015-05-01T18:35:29.037+05:30ఘంటసాల గానంబున కరిగిపోయి...ఘంటసాల గానంబున కరిగిపోయి

తలపుల తేరుగట్టి మనో వీధిన ఏగుచుండ

మకరంద తేనియల వర్షంబు కురిసె

అద్భుతముల్కనుగొని అచ్చెరువొంది

ఇది ధ్యానమా పరధ్యానమా అను సంశయమునుండ,

ఊహల ఆకసాలను చుంబించు

పుష్పక విమాన యానమాయని

మనసు తృళ్ళిపడుచుండ

స్వార్థ ఫలము కోరి చేసిన తపస్సునకు ఫలితముండజాలదని

ఫలమాశించని మనోగమనము మహా తపస్సని

నేనెరింగితి

సర్వజ్ఞుడను కాదు

పండితుడను అసలే కాదు

అనుభవమ్ము గడించిన పామరుడిని

నిక్కచ్చి నిజములు మీకుంగోపము దెప్పించునో

తర్క వితర్కముల నన్ను భస్మీపటలము గావించదరో గానీ

మనసు బల్కిన పల్కులను

అక్షరముల మాలగా గూర్చితి

అంతర్జాలమున పంచ గోరితిUnknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-21968477797565326292015-04-29T15:41:00.001+05:302015-04-29T15:41:37.416+05:30ఇది అసలు సిసలైన ప్రత్యేకహోదా!!నాలుకా లేక తాటిమట్టా తెలియని స్థితిలో

నాయకులు నోటికొచ్చింది వాగేసి

ప్రజలకు హామీలు గుప్పించారు

ప్రత్యేకహోదా ప్రమాణాలు చేశారు

తీరా పదవులొచ్చాక

వెంకయ్య గారు ప్రత్యేకం తప్ప అంతా మాట్లాడతారు

మోడి మాటలు చేతలు మార్చేసి నవ వరుడైనట్లు తిరుగుతున్నారు

బాబు నోరు తెరుస్తే చాలు వరాల జడివాన కురిపించేస్తున్నారు

జగనన్న సభలలో మాత్రమే తన యుద్ధ ప్రతిభ కనపరుస్తున్నారు

మరి ప్రత్యేకహోదా గురించి వీరేం చేశారు?

వీళ్ళకి గొంతు పెగలడం లేదు

మాటలు రావడం లేదు

క్రొత్త రాజధానికి దిక్కు లేదు

పాత రాజధానికి వెళ్తే శత్రువులంటున్నారు

ఇది చాలా ప్రత్యేకహోదా!

దేశంలో ఆ ప్రభుత్వమే రాష్ట్రంలో ఆ ప్రభుత్వమే

కాని దమ్మిడి ఉపయోగం లేదు

కోట్లు మాటల్లో తప్ప చేతుల్లోకి రావడం లేదు

చేతల్లో ఒక్క హామీ జరిపి చూపడం లేదు

ఇది మరీ ప్రత్యేకహోదా!!

విభజనకు ముందు

ఐదేండ్లు ప్రత్యేకమంటిరి

తరువాత పదేండ్లు ప్రత్యేకమంటిరి

మంత్రులయ్యాక పదిహేనేండ్లు ఇచ్చినా తప్పు లేదంటిరి

ఇప్పుడు ఇవ్వలేమంటున్నారు

ఇది అసలు సిసలైన ప్రత్యేకహోదా!!Unknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-5639386997890901801.post-83257169377765652772015-04-24T22:12:00.002+05:302015-04-25T18:55:07.314+05:30అమ్మ ఇప్పుడు ఒక చిన్న పాపదేవుడి కథలు చెప్పి

భక్తి విలువ చెప్పి

అ,ఆలు దిద్దించి

అమ్మా..ఆవు నేర్పించి

చందమామను చూపించి

గోరు ముద్దలు తినిపించి

చందమామ చదివించి

చక్కని పదాలు నేర్పించి

చిన్న గాయమైతే విలవిల్లాడి పోయి

అల్లరి చేస్తే మహదానందపడి పోయి

నన్ను ముద్దు ముద్దుగా పెంచి

జీవితపు ప్రయాణంలో అలసిన అమ్మ

ఇపుడు ఒక చిన్న పాప!

మెల్ల మెల్లగా నడుస్తూ

తడబడే అడుగులు వేస్తూ

కళ్ళద్దాలనుండి తొంగిచూస్తూ

నచ్చకపోతే మూతి ముడుచుకుంటూ

అప్పుడప్పుడూ బోసినవ్వ్లు నవ్వేస్తూ

తెల్లటి వెంట్రుకలు ముడివేసి

ప్రశాంతమైన మోముతో

దేవుని పాటలు వింటూ

నిశ్శబ్దంగా శూన్యంలోకి చూస్తూ

ఎప్పుడంటే అప్పుడు నిదుర పోతూ

కనపడని మందుల డబ్బాకై మళ్ళీ మళ్ళీ వెదుకుతూ

పిల్లలతో పోటిపడి పోట్లాడుతున్న అమ్మ

ఇపుడు ఒక చిన్న పాప!

Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-31533616714617735432015-04-23T14:50:00.000+05:302015-04-23T14:50:36.042+05:30నోటిలో ముద్ద కడుపులోకి దిగాలంటే పన్ను కట్టాలా?నోటిలో ముద్ద కడుపులోకి దిగాలంటే పన్ను కట్టాలా?

ఇంటిలోని వంటగదికి పోవాలంటే పన్ను కట్టాలా?

నిర్ణయించిన వారి పల్లు రాలగొట్టాలా?

కడుపు రగిలిపోతూంది వీరి పిచ్చి చేష్టలకి

గుండె మండిపొతూంది ఈ అసమర్థ విలువలకి

విభజించినప్పుడు అలోచించారా?

అయ్యా ఇష్టమొచ్చినట్లు విభజించారు

ఇబ్బందులున్నాయంటే ఆలకించారా?

కళ్ళు మూసుకుని పని చేస్తూ ప్రజల కడుపులు కొట్టారు

కన్నూ మిన్నూ గానక గురకలెట్టారు

రాజధాని పక్క రాష్ట్రంలో ఉంచేసి,

పోవాలంటే పన్ను కట్టాలి మరి!!

అది జగమెరిగిన సత్యం

పదేళ్ళ రాజధాని అవసరమా మరి?

ఇది విభజన గాయాల మహమ్మారి!

ఎవరు ఎవరా వెధవ నిర్ణయాల మార్గదర్శకులు

పని లేని శని గాళ్ళు పచ్చి మోసగాళ్ళు

విచక్షణలేని విషపు సర్పాలు

దూరదృష్టి లేని మంద బుద్ధులు

చదువుకోని వెర్రి నాగన్నలు సైతం విరగబడి నవ్వే

నిర్ణయాలు

దారీతెన్నూ లేని అడవిలో విడిచిపెట్టే గొప్ప సూత్రాలు

మూర్ఖుల ప్రకోపాలకు రాష్ట్రాలను బలియిస్తూ

చెదలు పట్టిన చదువులు చదివి చెత్త మనపై రుద్దేస్తూ

నోరు కుట్టేసి

చేసేదే చేస్తామంటూ

విభజించినదెవ్వరు?

తలా తోకా లేని రాతలు రాసేదెవ్వరు?

వెనకుండి సమర్థించినదెవ్వరు?

ముందుండి దారిచూపినదెవ్వరు?

నిర్ణయాలు మురగబెట్టి పగబట్టిందెవ్వరు?

పదేళ్ళ రాజధాని అవసరమా మరి?

ఇంకా అచూరుకే పట్టుకు వ్రేళ్ళడటం అవసరమా మరి?

Unknownnoreply@blogger.com12tag:blogger.com,1999:blog-5639386997890901801.post-8544252491968317602015-04-15T18:49:00.003+05:302015-04-15T18:49:50.531+05:30నిదుర పలుకరించిందిమూతలు పడుతున్న కనులు
నిద్దురను కొంచెం కొంచెంగా
అహ్వానిస్తున్నాయి
నిదుర భారం మొయలేక
కనురెప్పలు దాసోహమంటున్నాయి
క్రింద బూరుగ దూది పరుపా?
చలువ రాతి నేలా?
మట్టితో నిండిన రహదారా?
లెక్క చేయకుండానే శరీరం
జారిపోతూంది
కల మొదలయ్యీ విరామాలిస్తూ
కొంత విసుగు పుట్టిస్తోంది
కొంచెం మెలకువ! కొంచెం నిదురా!
కలగలసి వెలుగూ చీకటి కరిగించి
క్రొత్త దృశ్యాలు తెరకెక్కించినట్టుంది
చేయిని మెత్తని దిండుగా మార్చి
మెల్లగా మనసును అలోచనల
చెరసాలనుండి విముక్తి కల్పిస్తూ
హృదయం నుండి తీర్పు వెలువడింది
బాదలు, బాధ్యతలు, భారాలు
సంతోషాలు, సంబంధాలూ
ఇప్పుడెందుకో ఏవీ గుర్తుకు రావడం లేదు
తేలిపోతూ తూలిపోతూ
స్వేచ్చ దొరికిన పక్షిలాగా
ఎవరికీ అందని క్రొత్త లోకంలోనికి ఎగిరిపోతుంటే
సుఖానికి చిరునామా ఇప్పుడే దొరికినట్లుంది
దారం కట్టినంతసేపూ ఎలా తెంచుకోవాలన్న
గాలిపటంలాగా మనసు యుద్ధం చేసింది
దారం తెంచుకుని ఇప్పుడెగిరిపోతూ ఉంది

Unknownnoreply@blogger.com2tag:blogger.com,1999:blog-5639386997890901801.post-61424824550495551482015-04-14T12:03:00.000+05:302015-04-14T12:04:41.258+05:30ఆశలు - దురాశలుఆశపడి

వెంటపడి

వేటాడి

సాధిస్తే

అది గెలుపు!

దురాశపడి

బలంతో

బలగంతో

గర్వంతో

స్వంతం చేసుకోవాలంటే

అది అహం నిండిన బలుపు

ఆశలు

కథలిస్తాయి

కదిలిస్తాయి

కవితలల్లిస్తాయి

విజయగాధల చరితనిస్తాయి

దురాశలు

మరపు రాని మరకలిస్తాయి

మృగపు ఛాయనిస్తాయి

పరాభావాన్నిస్తాయి

నియంతృత్వాన్నిస్తాయి

ఆశలు

కరిగిపోయే రుచులౌతాయి

కమ్మని అనుభూతులిస్తాయి

కలకాలం మిగిలే జ్ఞాపకాలిస్తాయి

దురాశలు

కరడుకట్టిన విషాన్నిస్తాయి

క్రౌర్యం నిండిన అనుభవాలిస్తాయి

కరిగిపోని వ్యర్థాలౌతాయిUnknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-90556463432711079522015-04-04T19:48:00.000+05:302015-04-04T19:48:39.323+05:30కొనసాగు కనుచూపు మేరా కనులార్పని ఆ ఎదురుచూపుఆగని మనసు కాసే కాపు

కనులార్పని ఎదురుచూపు

ఆశ నిరాశల కూర్పు

కనులార్పని ఆ ఎదురుచూపు

నేర్వని భాషల నిట్టూర్పులు

నెరిపిన భాషణల ఓదార్పులు

నెమరేసిన జ్ఞాపకాల పలకరింపులు

నెమ్మది నెమ్మదిగా

కనులలో

తళుక్కుమనే నవ్వులు

చురుక్కుమన్న కోపాలు

తడితగిలి మసకబారి

ఒక్కొక్క చుక్కా జారి

ఎందుకోయని

యేలనని

కొనసాగు కనుచూపు మేరా

కనులార్పని ఆ ఎదురుచూపు

చెమర్చిన కళ్ళు నల్లని కాటుక చివరలను

మరింత అందంగా దిద్ది,

సరిచేసిన విల్లులై కనుబొమ్మలు ఒయ్యారాలు ఒలుకుతూ

ముడిపడుతూ విడిపోతూ

కొంటె చూపులు కొంత జోడించి,

ముంజేతిని ఆనుకున్న

మోము అంచున మంద్రముగ

పాడుతున్న గొంతులోని రాగం

పెదవి దాటి పొరలకుంది

మనసులోని ఆత్రుత

తీరాన్ని దాటకుంది

కొనసాగు కనుచూపు మేరా

కనులార్పని ఆ ఎదురుచూపు

చక్రవాకాలకు సిద్ధమౌతూ

ఉప్పెనలకు సమాయత్తమౌతూ

సంభ్రమాశ్చర్యాలకు పురివిప్పి

మోమున ఒక ఒంక నెలవంక

మరో వంక మినుకు మినుకు మంటున్న ఆశల వేడుక

కొనసాగు కనుచూపు మేరా

కనులార్పని ఆ ఎదురుచూపు

Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-117079719514826572015-03-30T17:05:00.000+05:302015-03-31T12:27:23.695+05:30పొరలు పొరలుగా ఆ గ్యాపకాలు నా చుట్టూ తెరలు కట్టుతుంటాయిబడి ముందల కూకున్న

అచ్చమ్మవ్వ కలే పండ్లమ్ముతుంది

బిక్కిపండ్లు, జామపండ్లు, రేగుపండ్లు,

ఉసిరికలు, గంగి రేగుపండ్లు

కుప్పలు కుప్పలు పోసి అమ్ముతుంది

ఒంటికి గంట గొట్టేస్తానే చెడ్డీలు లాక్కుంటూ

ఉరుకుల పరుగులతో మేమంతా

ఆ బండ చుట్టూ చేరుతాము

అదివ్వు ఇదివ్వమని రచ్చ రచ్చ చేస్తాము

రెండు పైసలు, ఐదు పైసలు,

పావులాలు ఘల్లు ఘల్లుమని రాలతాయి

పట్టమీది పండ్ల కుప్పలన్నీ కరిగిపోయి

పట్టకింద కాసులగుట్టలై పెరుగుతాయి

తాత అప్పుడప్పుడూ వస్తాడు

ఎర్ర కళ్ళతో తాగి తూలుతూ వస్తాడు

వాన పడితే తాత గొడుగు పడతాడు

అప్పులు పెడితే పర్వాలేదంటాడు

అప్పుడవ్వా తాతలకు జగడం మొదలౌతుంది

ఒకటో అయ్యవారు రెండో అయ్యవారు

చీమిడి ముక్కుల సీనుగాడు, దారినపోయే

దానయ్యలు అందరూ పోటీబడిగొంటారు

రేగ్గాయలపై జల్లె ఉప్పుకారం కోసం

ఎగబడతారు

సాయంత్రం ఉడికించిన గుగ్గుళ్ళకై

గొడవలుబడతారు

అనపలు, శనగలు, అలసందలు, వేరు శనగలు

పెసరలు, తిరగమాత పెట్టి మహ రుచిగా

భలే రుచిగా అవ్వ వేడి వేడిగా తీసుకొస్తాది

ఒక్కోసారి ఒక్కోరకం గుగ్గిళ్ళు

ఇన్ని రుచులు సాద్దెమా అని మాకాశ్చర్యం

అత్తిరాసలు, వడలు, కజ్జికాయలు అప్పుడప్పుడూ

పండగలెనకాల అమ్ముకొస్తాది

శనగుంటలు, నువ్వులుంటలు, బఠాణీలు

కలకండ రాళ్ళు పల్లు పట పటలాడించే చిరు తిళ్ళు

అవ్వ మోసుకొస్తాది

బండ మీది అమ్మకాలు బండిమీదికి మారినాయి

బండిమీది అమ్మకాలు అంగడిగా మారినాయి

తాత కనిపించక మనవడు అమ్మబట్టె

అవ్వ అప్పుడప్పుడూ కనిపించి మాయమాయె

పై బడికి పోయినా చిన్నప్పటి గ్యాపకాలు మరచిపోక

అప్పుడప్పుడూ ఆ అంగడికి పోయెటోణ్ణి

పొరలు పొరలుగా ఆ గ్యాపకాలు నా చుట్టూ తెరలు కట్టుతుంటాయి

తెరలపైన పసితనపు చిత్రాలు కదులుతుంటాయిUnknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-5639386997890901801.post-43477051435235441002015-03-27T14:46:00.000+05:302015-03-27T14:49:43.956+05:30అన్నపూర్ణ ఒకనాడుఅన్నపూర్ణ ఒకనాడు

కాలేకడుపు ఈనాడు

పంట చేతికొచ్చినపుడు

బండ్ల నిండా ఒడ్లమూటలతో

ముసిముసిగా నావ్వుతూ

మీసాలు మెలివేసెను నాడు

పట్టణంలో పొట్ట చేతబట్టి

పొగ బండ్ల మధ్య ఉక్కిరిబిక్కిరౌతూ

గోడుగోడుమని ఏడుస్తున్నాడు నేడు

పదిమందికి పని ఇచ్చి

రాజులా బ్రతికెను నాడు

కూలీగా, కరవు ఆనవాలుగా

బరువుగా బ్రతుకీడుస్తున్నాడు నేడు

చెరువులకై దానమిచ్చి

గుడులకు, బడులకు దానమిచ్చి

గుప్పెడు ఆత్మ విశ్వాసంతో బ్రతికెను నాడు

గొట్టం బావులు పనికిరాక

గుక్కెడు నీరు కొనలేక

గరళం మ్రింగుతున్నాడు నేడు

పండుగంటే పల్లేల్లో మొదలవ్వాలనే వారు నాడు

పల్లేలే కనుమరుగయ్యి స్మశానాలౌతున్నాయి నేడు

ఇది వినాశనం

రైతు బ్రతకలేని రాజ్యం రాక్షసుల నిలయం

ఇది స్వనాశనం

Unknownnoreply@blogger.com0