కనుచూపు మెరలోన కానరానిది
ముందుచూపు ఉన్నవారికి
విశ్వాసం కలిగించేది
వెనుతిరిగితే
మిగలినిది
ముందడుగేస్తే
మనదయ్యేది
ఆశల పల్లకి
కొందరికి
నిరాశల ఎండమావి
మరికొందరికి
ఎంపిక మనదే
ఎదురుచూపు మనదే
ఎంచుకున్న
మార్గంలో పయనిస్తే
కోరుకున్న గమ్యం
చేరుస్తుంది
విశ్రమించక
శ్రమతో సాధిద్దామా?
శయనించి
స్వప్నంలో మిగిలిపోదామా?