Friday, April 13, 2012

జీవన శైలి

మూడు వన్నెల జండా ఎగురవేసినప్పుడు
 ఉద్వేగంగా వుంటుంది
భారతీయుడినైనందుకు గర్వంగా వుంటుంది
దేశం కోసం ఏదైనా చేయాలన్పిస్తుంది
కాని అది ఆ ఒక్క క్షణమే
ఆలోచనలన్నీ మారిపోయే మరు నిమిషమే
దేశం కోసం సమయం లేదు కేటాయించడానికి
చలన చిత్రాలతో సరిపోయింది ఈ వారంతం మరి
బుల్లి తెర ధారావాహికలు
వార్తల పరంపరలు
అంతర్జాలం మహేంద్రజాలం
వేశాయి విలువైన కాలానికి గాలం
నాగరికత చెదలు పట్టింది
జీవిత శైలి భ్రస్టు పట్టింది
త్రుప్పు పట్టిన ఈ మనిషి తీరు మారాలి
ఆకలి చావులు ఒక వైపు
పుష్టి భోజనాలతో రోగిష్టులు మరో వైపు
బాలికా పసికందుల హత్యలు ఒక వైపు
ఆడది ఆకాశం లో సగం అనడం మరో వైపు
పులుల సంరక్షణ కాంక్షిస్తారు కొందరు
పులులై జనం మీద ఎగబడతారు మరికొందరు
అవినీతి నిత్య హారతి భారత మాతకి
కుళ్ళు రాజకీయం మణిహారమయ్యింది భారతావనికి

Monday, April 13, 2009

అలోచనల సాగరాలు

అంతు లేని అగాథాలు
అలోచనల సుడిగుండాలు
సమసిపోవు
మాసిపోవు
మరపురావు
మదిని వీడవు
త్రవ్వెకొద్దీ పుట్టలు పుట్టలు
విడమర్చెకొద్దీ చిలువలు పలువలు
తొలచి వెస్తాయి
మదిని కలచి వేస్తాయి
మౌనాన్ని మధిస్తాయి
ప్రశాంతతని హరిస్తాయి
రూపం లేని శత్రువై
నిదురకు దూరం చేస్తాయి
ఈ అలోచనల సాగరాలు
ఈ అవిశ్రాంత సంగ్రామాలు

Sunday, April 12, 2009

వేంకటేశుడు

ఎన్నెన్ని పదముల
కీర్తింతును
ఏడుకొండలవాడిని
వేవేల నామాల
ఆపదమ్రొక్కులవాడిని
శంఖు చక్రములు ధరియించి
సప్త గిరులయందు అవతరించి
వెలుగొందు వేంకటేశుడు
మమ్ము దీవించు శ్రీనివాసుడు
దర్శనభాగ్యమ్ముకై తరలి వచ్చు
భక్త జనులు ఎల్లవేళలా
నిత్య కల్యాణమై వెలుగొందు తిరుపతి తిరుమల!
కలియుగ దైవ నామ స్మరణ ప్రతిధ్వనించు నలుమూలలా!!

Sunday, April 5, 2009

బాసలు

చిక్కని బొట్టు
చక్కగ పెట్టి
చెవిన మెరిసే జూకాలు కూర్చి
తలనిండా పూవులు చేర్చి
చెంపలపై ఎర్ర రంగు పులిమేను
ఒరకంట నా యొంక జూసి
ఒక్క మురిపాల నవ్వు ముద్దుగ పంపి
కొండ వాలు లోకి చూపు సారించేను
గుండెల నిండా మంటలు రువ్వి
నిద్దరే రాని రాతిరి తిరిగి తిరిగి
నీ కంటి బాసలు పలుకరించేను

Tuesday, March 24, 2009

యుగాది

వసంతం అరుదెంచింది
వేకువ పులకించింది
క్రొత్త ఉగాది పలుకరించింది
లేత పచ్చ మామిడి పిందెలు
విరగబూసిన వేప పూత
ప్రకృతికి అలంకార శోభితమై
ఉగాదిని స్వాగతిస్తున్నాయి
తెలుగు సంస్కృతిలో భాగమై
జీవితపు సారాన్ని పంచిన వేదికై
జీవితంలో నిత్య వేడుకై
ఙ్ఞాపకాలు గుర్తుకు తెస్తూ
రుచుల కలగలుపు లాంటిదే జీవితానుభవమంటూ
ప్రభవిస్తోంది యుగాది
ఇది తెలుగు నేల తరించు పండుగ
మనసున నిలిచిపోవు నిండుగ
ఈ ఉగాది పండుగ

Thursday, October 23, 2008

దీపావళి

వికసిత హృదయాల
తీపి సంబరం,
ఆకసానికి ఎగసిన
తారా జువ్వల సంరంభం,
నృత్య గీతికల కోలాహలం
కలగలిసిన సంభ్రమం ఈ దీపావళి!!
వెలుగు పూల తోరణాల దీపావళి
హృదయాలలో మ్రోగె అనంద రవళి
ఈ దివ్వెల నవ్వుల ముందు వెల వెల బోతుంది అ పాల వెల్లి

Friday, October 3, 2008

ఊహల వర్షం

నీ కన్నుల
మెరిసిన ఓ వెన్నెల
నా మనసు నిండుగ విరిసింది
వేకువ పలికిన రాగమల్లె
నా గుండె లోతును తాకింది
లిఖించలేని మౌన రాగం
సాగర కెరటమై ఎగసింది
రేయీ పగలు కురిసే ఈ ఊహల
వర్షంలో ఇంకొంచెం ఆడాలి
కలలాగ సాగే ఈ పయనం
అవిశ్రాంతంగా కొనసాగాలి

Monday, August 25, 2008

పేగుబంధం

గుండెలోని ఓ చిన్ని రాగం
తల్లి నేర్పిన మమతానుబంధం
నిదురరాని ఓ ఘడియలోన
నిశీధి పాలించు నిశ్శబ్దసీమలోన
కంటి ఎదుట నిలుస్తుంది
దూరమున్న ఆ పేగుబంధం
ఓ పలుకరింపుకు తపించునో
ఓ చిన్ని మాటకై ఎదురుచూచునో
ఏడు సముద్రాల ఆవల ఏచొట నుంటివో
ననుచు ఆ తల్లి వేయి దేవుళ్ళను మ్రొక్కుచుందునో
తల్లీ నీ దరికిచేరి సేవచేయు భాగ్యమ్ము
నాకిమ్మని ఆ దేవుని నే కోరుచుంటి

Sunday, August 24, 2008

మరో ఉదయం

తెల తెల వారుతూంది
ఆకాశం క్రొత ఉదయాన్ని ఆవిష్కరించబోతున్నది
చిత్రకారుడి ఊహలు
రూపం దాల్చినట్లు
ప్రపంచమంతా చీకటి వెలుగుల మిశ్రమం
అక్కడక్కడా శీతాకాలపు చలిమంటలు
చలిమంటల నుండి ఎగసే పొగలన్నీ
నింగి నుండి నేలకు జారిన రహదారులల్లెవున్నాయి
చల్లని గాలి తెమ్మెరలు తాకి మేని పులకరిస్తోంది
ఉషాకాంతుల పలుకరింపులతో
జగత్తు నిండా వెలుగు నిండిపోతూంది
చీకటి పారిపోయింది
ఆశలన్నీ నిజమయ్యె మరో ఉదయం మొదలయ్యింది

Wednesday, July 23, 2008

నీ స్నెహం!!

నీ ప్రక్కన కూర్చుని
ఈ ప్రపంచాన్ని వీక్షిస్తే
ఈ ప్రపంచమంతా
అనుబంధాల అల్లికలా అనిపిస్తుంది
చీకట్లు ముసిరిన నా మనసులో
చిరు దీపం వెలిగినట్లనిపిస్తుంది
కన్నీరు నిండిన కష్టాలన్నీ
దూది పింజలై తేలిపోతాయి
కలిసి చేసిన ప్రతి పని
ఆ పాత మధురమై
తీపి ఙ్ఞాపకమైతుంది
జీవిత బాటసారులమై
పయనించే దారులు వేరైనా
నీ స్నేహం నాకు నేను సాధించుకున్న
అత్యంత విలువైన బహుమానం
మాటలకందని మహోన్నత
మధుర భావాల మహా సాగరం
ఎల్లలు లేని బంధాల సువిశాల ఆకాశం
విశ్వాంతరాళంలో మెరుస్తున్న నక్షత్రాల సమాహారం
నీ స్నెహం!!

Friday, May 9, 2008

ఆమ్మ పాడే లాలి పాట

అమ్మ పాడే లాలి పాట
చల్లని దీవెనల వెన్నెల బాట
వీనుల విందైన ఆ పాట వింటూ
నిదురలోకి జారిపోతాను
ఈ ప్రపంచాన్నే మరచిపొతాను
కలల దొంతరల్లో తేలిపోతాను
చుక్కల్లో రాజునై విహరిస్తాను
అమ్మ ప్రెమంతా అందులో చూశాను
ఆమ్మ లాలి పాట
గుండెకి ధైర్యం చెబుతుంది
అనుక్షణం నీవెంటే ఉన్నానంటుంది
కలతలన్నీ మరచి కంటి నిండా నిద్దరోమంటుంది
ఎన్నెన్ని మమతానుబంధాల పూలతోట
ఆమ్మ పాడే లాలి పాట
---------
లాలి పాట పాడే ప్రతి అమ్మకి వేనవేల కృతఙ్ఞతలు

Wednesday, May 7, 2008

ఆ బాల్యం కావాలి

అక్కడక్కడా శీతాకాలపు చలిమంటలు
చలిమంట చుట్టూ స్నేహితులు
వెచ్చగా చలి కాచుకుంటూ
స్నెహితులతో కబుర్లాడుకుంటూ
ఆగి పోయె కాలం
చిన్ని చిన్ని పోట్లాటలు
చెమ్మగిల్లె కన్నులతొ తిరిగి కలిసిపోవడాలు
చిరునవ్వుల గుభాళింపులతో
నిండిపోయిన పుటలు
నాలుక పై కరిగి పోయె
అమ్మ చెసిన రవ లడ్డూలాగా
ఎంత తీయటి ఙ్నాపకం
ఆ బాల్యం కావాలి
మళ్ళీ మళ్ళీ రావాలి

Tuesday, April 22, 2008

జారే కన్నీటి శాపం

ఊపిరి నిప్పుల శగలన్నీ
ఉప్పెనలా ప్రవహిస్తాయి
గుండెల్లో రగిలే బడబాగ్నులు
ద్రవించే లావా ప్రవాహాలైతాయి
ఒక్క చూపుతోనే ప్రపంచం కాలి బూడిదవుతుంది
ఆవేశం కన్నా ఎక్కువ
అణు విస్ఫొటనం కన్నా ఎక్కువ
జీవం లేక జారే కన్నీటి శాపం

Sunday, April 6, 2008

సర్వధారి ఉగాది శుభాకాంక్షలు

మిత్రమా
తేట తెలుగు మాటలోని తీయదనం తెలుసు నీకు
మాతృ భాష మరచిపోకు
ఉగాది పచ్చడి తీపి చేదులు తెలుసు నీకు
ఉగాది పండుగ మరచిపోకు
దూరం లో వున్నా నా మనసు తెలుసు నీకు
మన ఈ స్నేహం మరచిపోకు

Wednesday, March 12, 2008

స్వేదంలో మోదం

స్వేదంలో మోదం దాగుంది
నిర్వేదంలో ఖేదం మిగిలుంది
విజయాల బాట పట్టాలంటే
క్రొత్త ఆశలు చిగురించాలి
కలల షికారులు తగ్గించాలి
మొదటి అడుగుకై అలోచిస్తూ
సంవత్సరాలు గడిపేసి
గమ్యం చెరిపేసి
నీనుండి నీవే దూరంగాపారిపోకు
ఈ చిన్ని జీవితం వ్యర్థం కానీయకు
పోరాటం నీ వంతు
క్షణ క్షణం పరిణితి సాధించు

Sunday, February 24, 2008

వ్యర్థానికి అర్థం

బానిసత్వమే నేర్పిందో
బద్దకమే నేర్పిందో
ముందు చూపే లేదు
ఆశ తీరే దారి కానరాదు
వూహల విశ్వాంతరాళంలో పేక మేడలే కడుతూ
గాలి పాటలు పాడుకుంటూ
ఏ తుఫాను గాలికో కొట్టుకు పోతావు
ప్రపంచానికి మరో రోజు గడచిపోతుంది
నీ లాంటి వ్యర్థమైన కథ మరోటి మొదలౌతుంది

Sunday, March 25, 2007

క్రొత ఆశ నాలొ

ఒక్క మాటా కరువైన రోజులకి దూరం గా,
నాలొ నేనే మట్లాడుకుంటూ గడిపిన క్షణాలుమరచి పొతూ,
చిక్కని చీకటి లో ఉలిక్కి పడి కళ్ళు విప్పితే
గుండె చప్పుళ్ళకు వికృత నాట్యం చేసే
అంధకారమైన భవిష్యత్తు నన్నే చూస్తూ వికటాట్టహాసం చెసేది,
ఉదయం కోసం ఎదురు చూసినా
నా మనసు లో చీకటి రాత్రులే మిగిలేవి
ఆ సమయపు శృంఖలాలు తెంచుకొని
బాహ్య ప్రపంచం లోనికి తొలి అడుగు పెట్టాను
ఎటు వైపు చూసినా పచ్చిక బయళ్ళతో
ప్రపంచం కళకళలాడుతోంది,
స్వెఛ్ఛా గాలుల పలుకరింపులతో
మేను పులకరిస్తూంది
నే పరిగెడుతూనె వున్నా
దూరం గా ఆ పచ్చిక లోకి,
ప్రకృతి ఒడి లొకి
త్వరత్వరగా,
చీకటి గుహలకు దూరం గా
నాలుగు గోడల మధ్య బందీ గా
వున్న రొజులని మరచి పోవాలని
విజయాల వెలుగు రేఖల వైపు,
భయాలన్నిటినీ ధైర్యపు విచ్చు కత్తులకు బలి ఇచ్చి
స్వెఛ్ఛా లొకం లోకి పరిగెడుతూనె వున్నా

Tuesday, March 20, 2007

flower pots


ఒంటరి మనసు

కళ్ళు తెరిస్తే........
రాలె ఆకు,
ఎండిన చెట్టు,
ఒలికే కన్నీటి బొట్టు,
అంతే లేని ఆకశం,
నెనున్నాననే నిశ్శబ్దం,
మసి బారిన గొడ,
జాడే లేని నీ తీయని పాట
కళ్ళు మూస్తె......
చీకటి లో దీపం లా నువ్వు,
నా చుట్టూ అల్లుకున్న ప్రెమ తీగ లా నువ్వు,
గల గలా సవ్వడి చెస్తూ పారె నీటి లా నువ్వు,
నీ వెంటె వుంటా నంటూ నా నీడ లా నువ్వు,
చిరునవ్వుతో నా దరి కి రమ్మంటూ నువ్వు
వెన్నెల చల్లదనమంతా చూపు లో దాచిన నువ్వు

Friday, March 16, 2007

ఉగాది శుభాకాంక్షలు

వసంతానికి స్వాగతం
శుభోదయానికి సుస్వాగతం
ముగ్గులేసిన ముంగిట్లో
మామిడి తోరణాల వాకిట్లో
ఉగాది అడుగిడు తరుణం
స్నేహం,ప్రేమ పదింతలవ్వాలి
విజయాలు మన సొంతమవ్వాలి
తేనె తేటల మన తెలుగు
నిత్య పరిమళాలు
వెదజల్లుతూనే వుండాలి!!

వేచి చూపు

వేకువ పలుకరించినపుడు మాయమయ్యే
మంచు తెర లాగ
ఈ దూరాలన్నీ తొలగి పోతాయి
మెఘాలన్నీ వాన చినుకులై జారి పొతాయి
చిగురులు తొడిగిన క్రొత్త వసంతం పలుకరిస్తుంది
రెక్కలు కట్టుకుని నీవు నా ముందు వాలతావు
నిజమేనని నా మనసు పరవశిస్తూ వుంటుంది
తలుపు చప్పుడు కి నా కల చెల్లాచెదురౌతుంది
తిరిగి నీవు పలుకరిస్తావని నా వేచి చూపు మొదలౌతుంది

మొదటి మాట

సుస్వాగతము
తెలుగు ఇలా ఈ జగద్వలయపు అల్లిక
పై వ్రాస్తూ వుంటే చాలా సరదా గా వుంది
వ్యక్తీకరించె పలుకులకన్నా మనసు నుండి జారే వూసులు
మాటలకందని భావలెన్నో చెబుతాయి
అవన్నీ అక్షరాల మాల గా అల్లి ఈ పుట లొ సమర్పిస్తున్నాను

Hit Count