నాలుకా లేక తాటిమట్టా తెలియని స్థితిలో
నాయకులు నోటికొచ్చింది వాగేసి
ప్రజలకు హామీలు గుప్పించారు
ప్రత్యేకహోదా ప్రమాణాలు చేశారు
తీరా పదవులొచ్చాక
వెంకయ్య గారు ప్రత్యేకం తప్ప అంతా మాట్లాడతారు
మోడి మాటలు చేతలు మార్చేసి నవ వరుడైనట్లు తిరుగుతున్నారు
బాబు నోరు తెరుస్తే చాలు వరాల జడివాన కురిపించేస్తున్నారు
జగనన్న సభలలో మాత్రమే తన యుద్ధ ప్రతిభ కనపరుస్తున్నారు
మరి ప్రత్యేకహోదా గురించి వీరేం చేశారు?
వీళ్ళకి గొంతు పెగలడం లేదు
మాటలు రావడం లేదు
క్రొత్త రాజధానికి దిక్కు లేదు
పాత రాజధానికి వెళ్తే శత్రువులంటున్నారు
ఇది చాలా ప్రత్యేకహోదా!
దేశంలో ఆ ప్రభుత్వమే రాష్ట్రంలో ఆ ప్రభుత్వమే
కాని దమ్మిడి ఉపయోగం లేదు
కోట్లు మాటల్లో తప్ప చేతుల్లోకి రావడం లేదు
చేతల్లో ఒక్క హామీ జరిపి చూపడం లేదు
ఇది మరీ ప్రత్యేకహోదా!!
విభజనకు ముందు
ఐదేండ్లు ప్రత్యేకమంటిరి
తరువాత పదేండ్లు ప్రత్యేకమంటిరి
మంత్రులయ్యాక పదిహేనేండ్లు ఇచ్చినా తప్పు లేదంటిరి
ఇప్పుడు ఇవ్వలేమంటున్నారు
ఇది అసలు సిసలైన ప్రత్యేకహోదా!!
చాలా బాగా చెప్పారు.
రిప్లయితొలగించండిఇప్పుడు AP అనుభవిస్తున్న "ప్రత్యేక" హోదా (పంజాబ్, హర్యానాలతో సహా) ఇంకెవ్వరికీ లేదు.
బోనగిరి గారు,
తొలగించండిమీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు. కుళ్ళు రాజకీయాలలో మనం కొట్టుకొని పోతూనేఉన్నాము. ఎదురుతిరిగి ప్రశ్నించాలని నా తపన.
-ఓచిన్నమాట