ఉద్యమమే ప్రక్క దారి పడితే
పిడికిలి బిగించి
ప్రాణాలకు తెగించి
వెంట నడచిన
వేకువ వెదకిన
ప్రజలేమౌతారు?
వంచన పంచన
కూర్చొని
బేరసారాలు
కుదుర్చుకొని
బందువులను
రాబందులను
గద్దెనెక్కిస్తే
ప్రజలేమౌతారు
నా దారి వేరంటూ
ఉద్యమం ఒదిలేసి
వెంటనడచిన వారి
నోళ్ళు మూయించి
పోరు బాటలు మరచి
మాటలకే పరిమితమైతే
కోటలకే దాసోహమంటే
స్వార్థం నరనరానా పాకుతుంటే
ప్రజలేమౌతారు?
నిప్పుల ఉప్పెనలౌతారు
నిశ్శబ్ద జల ప్రళయాలౌతారు
గర్జించే అగ్ని పర్వతాలౌతారు
పట్టిన చిలుమును
పెరిగిన కలిమిని
పట్టిన త్రుప్పును
పేరిన ధూళిని
ప్రజలు కడిగేస్తారు
కోటని
తోటని
పదవిని
బలిమిని
అర్థాన్ని
స్వార్థాన్ని
ప్రజలు కూల్చేస్తారు
అలాంటి ...... ఏ కోటనైనా ఏ తోటనైనా ..... ఏ ప్రజలైనా కూల్చేస్తారు. బాగుంది కవిత.
రిప్లయితొలగించండిరావు గారు,
తొలగించండిమీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
-ఓచిన్నమాట
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిశర్మ గారు
తొలగించండితిరిగి స్వాగతం. వీలైనంతవరకు సరిచేశాను. ధన్యవాదాలు
-ఓచిన్నమాట