Expressing my heart feelings[Manasu Palike O chinna maata] in the form of poetry in my mother tongue ...Telugu. [ Kavitha, manasu, kavithalu, kavita, blog, blogu, poetry, bhaavaalu]
తెలుగును ఉరితీస్తున్నారు రక్షించండి
మాతృభాష మరువకుండా
తెలుగు మాట అంతరించిపోకుండా
నిండుగా గుండెల్లో ఉండాలని
పరాయి రాష్ట్రంలో ఉన్నా
తమ పిల్లలకి తెలుగు నేర్పుతుంటే
తమిళ భాషే నేర్చుకోవాలంటూ
వారి భాషే బ్రతకాలంటూ
వ్యాధి శోకిన కొందరు
సుందర తెలుంగు విలువ తెలియని కొందరు
వందల ఏళ్ళుగా సమాజ నిర్మాణంలో
పాలుపంచుకున్నామని విస్మరించిన కొందరు
తెలుగు భాషను ఉరితీస్తున్నారు
విద్యార్థుల్ని బలవంతంగా
తమ భాషలోనే చదవాలంటూ
ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వం రుచి చూపిస్తున్నారు
నిర్భంధంగా సమూలంగా తెలుగును తొలగిస్తున్నారు
న్యాయస్థాన తీర్పునే పరిహసిస్తున్నారు
పరీక్షలొచ్చే వేళ పైశాచికం ప్రబలిస్తున్నారు
తమిళవారు అంధ్రదేశంలోనూ ఉన్నారు
తమ భాషను ఆనందంగా అభ్యసిస్తున్నారు
ఎందుకు వారికి ఈ పైత్యం అంటిందో
తెలుగు భాషను ఉరితీస్తున్నారు
అంధ్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తే
ఏమి తెలియనట్లు అమాయకంగా వెళ్ళిపోయాడు
తెలుగు దేశమంటాడు
ప్రపంచంలోని తెలుగువాళ్ళందరూ తనవాళ్ళంటాడు
మరి అక్కడ తెలుగు భాషను ఉరితీస్తుంటే చోద్యం చూస్తున్నాడు
తెలుగు బ్రతకాలి
భావాల బంధాల వారధియై తులతూగుతుండాలి
పుడమి పై తెలుగు మాటలు తేనెలూరుతుండాలి
భాష పరంపర తర తరాలకు కొనసాగాలి
కాని...తెలుగును ఉరితీస్తున్నారు తమిళనాట...రక్షించండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తమిళనాడులో తెలుగు విద్యా బోధనపై ఆంక్షలు ఏమిటో నాకు వివరంగా తెలీదు. అయితే ఈ విషయానికి ఇతర రాష్ట్రాలతో సంబంధం లేదని నా ఉద్దేశ్యం. ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్ర అంతర్గత విషయాలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.
రిప్లయితొలగించండితెలుగును ఉరి తీస్తున్నది పక్క రాష్ట్రం కాదు. మన సన్నాసులే. మీడియా తెలుగుకి అన్యాయం జరిగిపోతుందని పక్కరాష్ట్రం మీద పడి ఏడ్వడం మానేయ్యాలి. మీడియావాళ్ళు ప్రభుత్వం వద్ద తమకున్న పలికుబడినుపయోగించి తెలుగుకి న్యాయం జరిగేలా చూడాలి. అంతే గాని అమరావతి చైనా చంద్రబాబు వెంకయ్యనాయుడులగురించి రాయడం రాయడం మానేసి తెలుగు పై దృష్టి పెడితే తెలుక్కి న్యాయం జరుగుతుంది. అమెరికాలోను తమిళనాడులోను మన తెలుక్కి మన తెలుగోళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతుందని బూతద్దంలో చూపిస్తూ ప్రజలను రెచ్చగొట్టలని మీదియ ప్రయత్నిస్తుంది
రిప్లయితొలగించండిGood website Nani V film Box office collections
రిప్లయితొలగించండిIndependence day quotes in telugu
రిప్లయితొలగించండి