జన గర్జన
పెల్లుకుబికి
పోరాటం
నింగికెగసి
ఉడుకుడుకు నెత్తురుల
ఉరుకులెత్తి
వచ్చిందిర తెలంగాణ!!
పిడికిలి బిగించి
ప్రాణం తెగించి
గళ హోరుగ
జన వేదన
రగిలించిన
అగ్గి గోళమై
శివాలెత్తగ
వచ్చిందిర తెలంగాణ!!
విద్యార్థులు
అలుపెరగని
ఉద్యోగులు
ఉద్యమమై సాగగ
కొత్త ఉదయమై
వచ్చిందిర తెలంగాణ!!
ఒక్క రూపమై
సంధించిన బాణమై
నిదురించని నినాదమై
ఎరుపెక్కిన తూరుపున
వచ్చిందిర తెలంగాణ!!
సయ్యంటూ
పిల్ల పాపలు
జై అంటూ
పాట పదునెక్కి
జనవేడుక కదను త్రొక్కగ
జగమెల్లా స్వాగతము పలుక
వచ్చిందిర తెలంగాణ!!
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిశర్మ గారు
తొలగించండిబహువచనం కర్తగా వాడాను. అంటే యువకులు అని మరోవిదంగా పలుకుతూ. సవరణలకు ధన్యవాదాలు
-ఓచిన్నమాట