సుప్రభాతము సహస్ర గళముల పలుకుచుండగా
దినకరుడు, శుభకరుడు లోకబాంధవుడు ఉదయించుచున్నాడు
అరుణ కందూకమువలె తూరుపుకొండల నడుమ ఉద్భవించుచున్నాడు
శశిని సాదరముగా సాగనంపుతూ
చుట్టలుగా చుట్టుకున్న చీకట్లను చీల్చుకుంటూ
సప్తాశ్వ వాహనుడై శ్వేతాంబరి
ఉదయ భానుడు వేంచేయుచున్నాడు
రవికాంతుడు, నింగినేలు నిత్య ప్రకాశకుడు
లోక సేవకు ఉద్యుక్తుడైనాడు
మేఘాలను అరుణ రంజితం చేస్తూ
భాస్కరుడు అంబరాన్ని అలంకరించుచున్నాడు
కొండలు, కోనలు, గుట్టలు, పుట్టలు
వెలుగులతో నింపుతూ
పూవులు, లతలు, మొక్కలు, వృక్షాలు
వనజమిత్రునికి వినమ్ర స్వాగతాలు పలుకుచుండగా
మంద్ర మారుతాలు మౌన స్పర్శా మాధుర్యం పంచుచుండగా
ప్రకృతి ప్రభాత సొగసులు నింపుచుండగా
విధి మరువని లోక వీక్షకుడు
ఆకాశపథమును అరోహిస్తున్నాడు
ఉషాకిరణముల దీవెనలతో లోకం కనులు తెరిపిస్తూ
జగత్సాక్షైన ప్రచండ మర్తాండుడు
నింగినెగబాకుచున్నాడు
మిత్రమా ,
రిప్లయితొలగించండిసప్తాశ్వ వాహనుడై శ్వేతాంబరియై
కొండల, కోనల, గుట్టల, పుట్టల
వెలుగులు నింపుతూ
ఆకాశదేశాన అధిరోహిస్తున్నాడు
జగత్సాక్షైన ప్రచండ మార్తాండుడు
నింగి నెగబాకుచున్నాడు