సమైక్యం కోసం

రక్తం మరుగుతోంది
గుండె మండుతోంది
సమరానికైనా సిద్ధం
మరణానికైనా వెరువం
సమైక్యం కోసం!
రహదారులు జన ప్రవాహాలై పొంగుతుంటే
ఎలుగెత్తిన గళాలు సమర శంఖం పూరిస్తుంటే
లావా ప్రవాహమైతాం సమైక్యం కోసం !!
విప్లవమై రగిలిపోదాం
రణన్నినాదం వినిపిద్దాం
విద్యార్థులు,ఉపాధ్యాయులు,కార్మికులు,కర్షకులు
మహిళలు,వృద్ధులు,పెద్దలు,పిల్లలు
జన రేణువులై ఉద్యమ తీరాల్నినింపేస్తుంటే
స్వార్థ రాజకీయ శక్తుల నిర్ణయాలు తుడిచిపెట్టుకు పోతాయి
కదం త్రొక్కుతున్న సమైక్య సైనికుల కాళ్ళ క్రింద
పీలికలై పేలికలై నుజ్జునుజ్జై
ఈ నిర్ణయాలు నామరూపాలు లెకుండాపోతాయి
శిలాశాసనాలే శిధిలమయ్యాయి
నియంతలే ఉద్యమాలనెదిరించలేక ఉరేసుకొన్నారు
మీరెంత?, కాలికంటిన బురందంతా?
చేతికంటిన మసంతా??

2 కామెంట్‌లు:

  1. అసలు సమైక్యమంటే ఏమిటి? కేవలం హైదరాబాద్‌ను కోరుకోవటం సమైక్యమవుతుందా? మిగిలిన తెలంగాణ జిల్లాలు సమైక్యంలో భాగం కాద?.ఒక వెళ హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ ఏర్పాటుచేస్తే సీమాంధ్రలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో భావోద్వేగాలు లేవూ.వుందల్లా హైదరాబాద్ కాద? మరి ఎది తెలుగు జాతి సమైక్యత?
    తెలుగు జాతి ఆత్మగౌరవం.

    రిప్లయితొలగించండి
  2. మీరు తరువాతి కవిత చదివారా.......ఇదిగో ఆ పంక్తులు

    రాయలు ఏలిన రతనాల సీమ, మనది
    కోటి రతనాల వీణ తెలంగాణ, మనది
    ఆంధ్రులకు అస్తిత్వం కలిగించిన ఆంధ్ర, మనది

    రిప్లయితొలగించండి

Add your comment here