ఏకువ జాము సూరీడు ఎర్రాని సిగ్గద్దినట్టు
సిగురాకు లేతదనం వొల్లంత వొంపినట్టు
మబ్బుల్లొ తారాడు సెందురూడి సల్లదనం సూపుల్లొ నింపినట్టు
నగవులోన మల్లెలేవో గుప్పిళ్ళతో మత్తు గుమ్మరించినట్టు
పాట కడదామంటె పలుకు రాకపాయ
మాట కలుపుదామంటె మెలకువే లేకపాయ
రేపన్న చప్పాల
ఎట్టైన చప్పాల
మనసులోనీ మాట
మనసులో నీ మాట
మనసైన ఆ మాట
మనసిచ్చిన మాట
:):)
రిప్లయితొలగించండి