ఆ బాబు ఈ బాబు ఏమైయ్యారు?
ఆడకుండానే ఓడిపోవడం ఇదె, కాదా?
మనం ఆరంభ శూరులం కాదా?
ఉద్యమ వీరులెక్కడ?
అప్పుడప్పుడూ దిష్టి బొమ్మలు కాల్చిన ధీరులెక్కడ?
ఆంధ్ర పౌరుషమెక్కడ?
ఆత్మ గౌరవమెక్కడ?
సీమ చీమునెత్తురెక్కడ?
మీసం మెలిపెట్టడమెక్కడ?
తొడలు గొట్టటమెక్కడ?
జన వాహినులెక్కడ?
మానవ హారాలెక్కడ?
ఉద్యమం ముగిసిందంటారేం?
తట్టా బుట్టా సర్దెశారేం?
సభ ఆమోదిస్తే సరిపోతుందా?
పీడా పోయిందని అన్ని పక్షాలూ అప్పుడే నాకేంటి అంటున్నయేం?
పదవులెలా పంచుకోవాలని తపన పడ్తున్నాయేం?
మొదటి పౌరుడు మకిలిపట్టాడేం?
మౌన ప్రధానులు ఇప్పుడు మాత్రం గొంతెత్తారేం?పెద్దమ్మ చిన్నమ్మల నాటకాలు ఇంకా చూసి తరిస్తారా?
న్యాయస్థానంలో పొరాడలేరా?
రాజకీయ అపహాస్యం ఆపలెరా?
రాజ్యాంగాన్ని బంతాట ఆడుకున్న హీనులను మట్టి కరిపించలేరా?
చెల్లని ముద్ర వెయించుకున్న కాగితం మనల్ని శాసిస్తుందా?
యెవత్తో విసిరేస్తే యెవరో తెస్తే మనం భరించాలా?
శతాబ్దాల బానిసత్వం ఇంకా పోలేదా?
వెలుగు కిరణం విచ్చుకుంటున్నది చూడలేరా?
సమైక్యరణంలో పొరాడుతాం లేవండ్రా!!
Nyayanni Kooda dhikkarinche pedda manushulu mana palukulu.
రిప్లయితొలగించండిసమైక్యమనేది బూటకమని, రాజకీయ నాయకులు ఆడిన ఒక నాటకమని ఇప్పటికయినా గురిస్తే మంచిది.
రిప్లయితొలగించండితెలబాన్ అబద్దాల, దొంగ ఉద్యమం అన్నది ఎంత సత్యమో ఏడుపుగొట్టూ ఉద్యమం అన్నది అంతే సత్యం.
రిప్లయితొలగించండి