దుమ్ముపట్టి ధూళిపట్టి
నిమ్మకు నీరెత్తని తొత్తుగాళ్ళ
ఈ పొత్తుగాళ్ళ
రాక్షస రాజకీయ
నాయకుల పాలకుల
వూడ్చివేయ పూడ్చివేయ
ఎయ్ దరువెయ్!!
పొగరుతో ఒగరుతో
జనాలను గుమ్మపు జంతువులుగ
గుప్పెట బంధించిన
నేరగాళ్ళ నేతగాళ్ళ
దొరతనమణచ
ఎయ్ దరువెయ్!!
ఎకరాలకు ఎకరాలు
బొక్కెటోళ్ళ పుక్కెటోళ్ళ
డబ్బుల జబ్బుపట్టి
గబ్బుగొట్టె
మోసగాళ్ళ దొంగకోళ్ళ
పూసలదరగొట్ట బెదరగొట్ట
ఎయ్ దరువెయ్!!
కష్టాల్లో కరవులో
అలో లక్ష్మణా అని మేముంటె
లంచమంటూ పంచమంటూ
కడుపు మాడగొట్టె
ఈ కలుపుగళ్ళ కైపుగాళ్ళ
తరిమిగొట్ట తురుముపట్ట
ఎయ్ దరువెయ్!!
గొంతెండి
పొలమెండి
గుండెమండి పోతుంటె
నీటి రాజకీయలతొ
నీఛ రాజకీయాలతొ
ఇంటి ఈతకొలను లో
పబ్బం గడుపు
వడుపుగాళ్ళ ఏపుడుగాళ్ళగుండెలదర
కూసమదర
ఎయ్ దరువెయ్!!