ఎన్నికలో ఎన్నికలు
ఎన్ని కలల ఎన్నికలు
కల్లి బొల్లి హామీల ఎన్నికలు
కలుగులో దూరిన ఎలుకల్లా బయటకొచ్చే ఏలికలు!!
కుంగిన గుండె పై ప్రేమపూతలు
ముద్దుల ఒలకబోతలు
వంగి వంగి నమస్కారాలు
వేల వేల న "మస్కా"రాలు
నేతల నోట చిలుకపలుకులు
బక్క చిక్కిన ముక్కి మనిషిని ఆత్మబంధువని కౌగిలించే నేతలు!!
మందుల వరదై పారే ఎన్నికలు
గొర్రెల మందలా మారే ప్రజలు
ఎన్నుకున్న ప్రజలు మూర్ఖులపాలు
ఎందుకన్నవారు తన్నులపాలు
ప్రజస్వామ్యం మళ్ళీ మళ్ళీ నగవుల పాలు
మరణించిన వారు సైతం పాల్గొనే ఎన్నికలు
ఎవరు నకిలీయో తెలియని ఎన్నికలు
"నల్ల" నగదు బదిలీ ఎన్నికలు
ఐదు సంవత్సరాల ఊడిగంకై సమర్పించే సంపూర్ణాంగీకారం ఎన్నికలు!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here