మనసు గెలవటం తలంచక
అర్థం చేసుకుని ఆరాధించలేక
మూర్ఖంగా ఆస్వాదించాలనుకున్నారు
క్షణికపు కోర్కెలతో
పైశాచికత్వం దుర్మార్గత్వం కలబోసిన
జుగుప్సాకరమైన దారులెన్నుకున్నారు
ఆమ్ల దాడులు, అకృత్యాలు, అపహరణలు
నిర్వచింపలేని అపరాధాలతో
ప్రకృతిని శాసించామనుకొంటున్నారు
నీచప్రవృత్తిని భరించమంటున్నారు
ఆకాశంలో సగం ఎక్కడ, భూమిపై విలువే లేదిక్కడ
ప్రకృతి తిరగబడితే
ప్రపంచం నాశనమే
విశృంఖల బేహారులకు మరణశాసనమే
కామ ప్రకోపకుల మధాంధ తత్వాన్ని
అణచటానికి ఈ స్నిగ్ధ మనోహర సౌందర్యమే
శక్తిస్వరూపిణియై మృగతృష్ణను
కడతేరుస్తుంది, కాలరాస్తుంది
ప్రకృతే తనను తాను మలచుకొంటూ
ఓ విప్లవంగానో
ఓ విధ్వంసంగానో
ఓ సంఘటిత శక్తిగానో
జీవుల సమతుల్యత పరిరక్షిస్తుంది
ఇది నిత్య సత్యం
ఇది సత్య కృత్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here