ఎన్ని విరహముల దాచి
వర్ణనలకు వర్ణములద్ది
వేదనలను సాగనంపి
వలపుల తలపులకు తలుపులు తెరిచి
నీ ముంగిట అరుదెంచినంతనే
చెలిని గాంచిన దిగ్భ్రమలో
నిచ్చేష్టుడనైతిని
నీ కనుచూపు బాణాలు
నా యొంక సంధించినంతనే
మధువు గ్రోలిన మత్తు కమ్ముచున్నది
వేల వేణువులు నన్నలరించినట్లు
మధురముగానున్నది
ఘల్లు మన్న నీ మువ్వల సవ్వడి
ఝల్లు మన్న నాయెద లయలొ
వంత పాడుచున్నది
దశాబ్దాలనుండి రాయిగనున్న
మనసేదో రాగాలు నేర్చినట్లున్నది
మాటలకందని సందేశమేదో
నీ కంటి పాపలో దాగున్నది
చూపులు కలిపి మధురోహల మధువు కొంచెం మరీ కలిపి
వాకిటనున్న ఈ బాటసారికి అందించవా!
అలసిసొలసి, ఊహలను శ్వాశించి, జీర్ణించిన
ఈ మనసుకు
నిరీక్షణ శృంఖలాలు త్రెంచి
నీ పరిష్వంగంలో లాలించవా !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here