క్రొత ఆశ నాలొ

ఒక్క మాటా కరువైన రోజులకి దూరం గా,
నాలొ నేనే మట్లాడుకుంటూ గడిపిన క్షణాలుమరచి పొతూ,
చిక్కని చీకటి లో ఉలిక్కి పడి కళ్ళు విప్పితే
గుండె చప్పుళ్ళకు వికృత నాట్యం చేసే
అంధకారమైన భవిష్యత్తు నన్నే చూస్తూ వికటాట్టహాసం చెసేది,
ఉదయం కోసం ఎదురు చూసినా
నా మనసు లో చీకటి రాత్రులే మిగిలేవి
ఆ సమయపు శృంఖలాలు తెంచుకొని
బాహ్య ప్రపంచం లోనికి తొలి అడుగు పెట్టాను
ఎటు వైపు చూసినా పచ్చిక బయళ్ళతో
ప్రపంచం కళకళలాడుతోంది,
స్వెఛ్ఛా గాలుల పలుకరింపులతో
మేను పులకరిస్తూంది
నే పరిగెడుతూనె వున్నా
దూరం గా ఆ పచ్చిక లోకి,
ప్రకృతి ఒడి లొకి
త్వరత్వరగా,
చీకటి గుహలకు దూరం గా
నాలుగు గోడల మధ్య బందీ గా
వున్న రొజులని మరచి పోవాలని
విజయాల వెలుగు రేఖల వైపు,
భయాలన్నిటినీ ధైర్యపు విచ్చు కత్తులకు బలి ఇచ్చి
స్వెఛ్ఛా లొకం లోకి పరిగెడుతూనె వున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Add your comment here