వాస్తు భయం తమరి పదవికా లేక మన ఊరికా?

మనుషుల్ని విడదీయాలన్నది మీ  అభిమతమైతే
ఐక్యత మీ పదవికి, ఉనికికి ఎసరనుకుంటే
కలిసే ప్రతి కూడలిలో నిప్పులు పోస్తారు
విమర్శిస్తే మాధ్యమాలు మూయిస్తారు
ప్రజాస్వామ్యపు గొంతు నొక్కేస్తారు

విడిపోయినా కలిసుండడానికి ఉన్న అవసరాల
కనీస ప్రయత్నాల్ని గండి కొడతారు
రెండు మార్లు ఒకే పరీక్ష విద్యార్థులు వ్రాయాలంటారా?
పాలించమంటే ఈ పనికిమాలిన చేష్టలు తగునంటారా?

స్వంత భయాలకి, స్వార్థ చింతనలకు
ప్రజల డబ్బును బలిపెట్టాలా?
వాస్తు భయం తమరి పదవికా లేక మన ఊరికా?
ఊరికైతే చాలా ఇళ్ళు పడగొట్టి మళ్ళీ కట్టించాలి సుమా!!

రైలు మార్గం స్వంత దార్లో నడవాలని పట్టు
నీటికై ప్రక్క రాష్ట్రంతో శిగపట్లు
భజన పరులూ, బాకా పత్రికలే మన చుట్టూ
ప్రజలకై మనం ఏం ఆలోచిస్తున్నట్లు?

మీరు రాజకీయం మింగిన ఉద్యమకారులు
నిషా తలకెక్కిన వారి రంగుల మేడలు మీ అడియాశలు
కళ్ళు తెరచి చూసే లోపల ఊడిపోతాయి ఈ పదవులు
సామాన్యులే వంచగలరు మీ మెడలు!!

పదవి ఊడిన ప్రక్క రాష్ట్రపు ముఖ్యమంత్రిని చూశారా?
బంగారు సింహాసనమునెక్కి నీలిగిన వ్యక్తి కతలు చదివారా?
ప్రజలు నచ్చని ముఖ్యమంత్రికి దశాబ్దపు వనవాసం ఎరుగుదురా?
విభజన విషం చిమ్మిన నూరు ఎండ్ల చేతి గుర్తు చెదిరిపోయింది తెలియదా?
క్షణ భంగురపు చౌక బారు ఎత్తుగడలు కట్టి పెట్టి ప్రజలకై బ్రతుకు మిత్రమా!!

34 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఊరు మాది, "మనది" అంటూ ఇంకా అనడం తగదేమో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. http://virijallu.blogspot.com/2014/01/blog-post.html

      జై గొట్టిముక్కల! 'మాది' అని చెప్పనీకి నువ్వెవనివి?

      తొలగించండి
    2. "మనది" అని రుబాబు చేయనీక నువ్వెవనివి?

      తొలగించండి
    3. మా తాతల కాలంకెల్లి మేం హైదరబాద్ నాంపల్లిలొ వుంటున్నం. మీదే వూరు? నువ్వేడ్కెల్లి వచ్చినవ్? నీలాంటోల్లు మా తెలంగాణా పరువు తీస్తుండ్రు.

      తొలగించండి
    4. మనది అనేటోడు అందరిని కలుపుకుపోయేటోడు. మనది అనుడు రుబాబు ఐతే మాది అనడాన్ని ఏమనాలె?
      సదువుకున్న అజ్ఞానివి లెక్కున్నవ్

      తొలగించండి
    5. ధన్యవాదాలు అజ్ఞాత గారు. చక్కగా చెప్పారు

      తొలగించండి
  3. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా మనవారే. జై గారు, ప్రాంతీయతతో నా భావాలకు అడ్డుకట్ట వేయలేరు. గోడలు కట్టి ప్రేమాభిమానాలను చంపలేరు. రండి, మనం నాయకుల కుళ్ళును కడిగేద్దాం
    ఎక్కడ తెలుగువారి పై అన్యాయం జరుగుతున్నా మన కలం బలంతో ప్రశ్నిద్దాం.

    మీరు వ్రాసిన "Andhra Misadventure on..." chadivaanu. you are well educated, I respect your views.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా టపా నచ్చినందుకు సంతోషం.

      భాష, ప్రాంతం, రాష్ట్రం, కులం, వర్గం, దేశం అన్నీ ఒక్కోసారి ఉపయోగపడతాయి కొన్నిసార్లు మన ప్రయోజనానికి అడ్డు పడుతాయి. ఏది ఎప్పుడు వాడాలో బేరీజు వేసుకోవాలి తప్ప ప్రతిచోటా భాషే పరమార్ధమనుకుంటే పప్పులో కాలేసినట్టే. ముఖ్యంగా సామాజిక & ఆర్ధిక రంగాలలో భాష కన్నా ప్రాంతమే ముఖ్యం.

      ఉ. నెల్లూరులో ఇంకొక్క రేవు కడితే అక్కడి తెలుగు & తమిళ ప్రజలు లాభం పొందుతారు. అలా జరగాలంటే భాషను పక్కబెట్టి ఇరు భాషల వారు ప్రయత్నించాలి. నేను తెలుగు వాడిని కాబట్టి తమిళులను తక్కువగా చూస్తానంటే కుదరదు.

      తొలగించండి
    2. ముఖ్యంగా సామాజిక & ఆర్ధిక రంగాలలో భాష కన్నా ప్రాంతమే ముఖ్యం.... On what basis have you written this?

      నెల్లూరులో ఇంకొక్క రేవు కడితే అక్కడి తెలుగు & తమిళ ప్రజలు లాభం పొందుతారు. అలా జరగాలంటే భాషను పక్కబెట్టి ఇరు భాషల వారు ప్రయత్నించాలి.... Where was this 'broadmind' when you wrote "ఊరు మాది"?

      తొలగించండి
    3. @Jai, please tell us about your native place. Where were you born? Where were your parents born? Did they migrate? If yes, from where? If not, for how long have you been residing in your native place? Are you working in your native place? Or elsewhere?

      తొలగించండి
    4. 1. Nellore Telugus & Tamils can both say "ఊరు మాది" about that city. I don't & can't just because of my language.
      2. Why do you need to know personal details?

      తొలగించండి
    5. I don't & can't just because of my language... On the same note, when someone writes a poem with title having 'మన ఊరికా', don't say anything.

      Hyd is still common capital. Who are you to say 'ఊరు మాది'?

      I was extending అజ్ఞాత's question about Hyd. According to him, he is from Hyd for 3 generations and Hyd is his. Where are 'you' from? And how can you say 'ఊరు మాది'? What if he tells you Hyd is mine and not yours?

      And you have conveniently missed my earlier question:
      నెల్లూరులో ఇంకొక్క రేవు కడితే అక్కడి తెలుగు & తమిళ ప్రజలు లాభం పొందుతారు. అలా జరగాలంటే భాషను పక్కబెట్టి ఇరు భాషల వారు ప్రయత్నించాలి.... Where was this 'broadmind' when you wrote "ఊరు మాది"?

      తొలగించండి
    6. Hyderabad city is an integral part of Telangana. Common capital is only for government facilities. Please read the act again.

      నెల్లూరు ఆ వూర్లో ఉండే అందరిది ఎలా అవుతుందో హైదరాబాదు కూడా ఇక్కడ ఉండే వారిది. దీనికి భాష, కులం, మతం లాంటి సంకుచిత విషయాలు అడ్డు కావు. నేను నెల్లూరును "మన ఊరు" అనను, అనలేను. అది వారిదే. హైదరాబాదుకు కూడా ఇదే వర్తిస్తుంది.

      తొలగించండి
    7. @Jai Gottimukkala,

      Hang on there. Tell me how do you know that this blog author does not belong to Hyderabad. How you know? If you don't know how you started that stupid discussion?

      So if someone write against your 'DORA' then they doesn't belong to so called Bangaru Telangana. Is it stupid logic? Stop this brainless nonsense.

      Btw, I must say thanks to god. Do you know why? Just for this statemetn 'నేను నెల్లూరును "మన ఊరు" అనను, అనలేను' from you. THANK you GOD.

      తొలగించండి
    8. [భాష, కులం, మతం లాంటి సంకుచిత విషయాలు అడ్డు కావు. .]
      వార్నీ ఏం సుభాషితాలు జేపుతుండు. దెయ్యాలు వేదాలు వల్లెవేయటం అంటే ఇదే. మాది మాగ్గావలె ఇది సువిశాల భావం గాబోలు .

      తొలగించండి
    9. @Jai,
      1. 'మన వూరికా' అన్న పదాలని సరిద్దబోయారు. మీరు 'ఊరు మాది ' అని రాశారు. మనది అని యెవరో రాస్తే దానిని రుబాబు అన్నారు.
      2. "Hyderabad city is an integral part of Telangana. Common capital is only for government facilities." అని రాశారు. So you agree that its a common capital. Then when someone writes 'మన వూరికా'', why are you trying to correct it?
      3. "భాష, కులం, మతం లాంటి సంకుచిత విషయాలు అడ్డు కావు" Don't you see the irony? సంకుచితత్వం గురించి యెంత బాగా చెప్పారండి!

      చివరిగా ఒక్క మాట: 'మాదీ వూరు ' అనడానికి 'ఈ వూరు మాది ' అనడానికి తేడా వుంది.

      This is not the first time for you are caught with your foot in your mouth. When will you learn?
      మీరు అజ్ఞాని కాదు. ఎందుకంటే జ్ఞానం సంపాదించుకోవచ్చు. ఇంకొక పదం వుంది కానీ మీ కోసం అది వాడితే ఆ పదానికే అవమానం.

      తొలగించండి
  4. @Jai,

    తమిళులంటే సౌత్ లో ఎవరైనా ఇష్టపడేవారున్నారా!? కన్నడ,ఆంధ్రావారికి తమిళులంటె అభిమానం ఎమీ లేదు. మలయాళీ, తమిళుల మధ్య కోల్డ్ వార్ ఎప్పటినుంచో ఉంది. వాళ్ల ద్రవిడ భాషా రాజకీయాలను అసహ్యించుకొంటారు. నెల్లూరులో తమిళులకు వాట ఉందా! ఎప్పుడు వినలేదు. రాజీవ్ గాంధి ని చంపినపుడు,నెల్లూరు సండే మార్కేట్ లో తమిళ షాపులను కాంగ్రెస్ వాళ్లు ధ్వంసం చేసారు. కిక్కురు మనలేదు. నెల్లురు మాది, అల్లూరు మాది అని తమిళ పైత్యం చూపిస్తే నెల్లూరోళ్లు మక్కెలిరగదంతారు. ఆంధ్రావారికి భాషాభిమానం మొదలైతే తడ SEZ లో పనిచేసే తమిళుల ఉద్యోగాలు డోలాయమానం లో పడుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. This is the basic problem. Aren't we all Indians first? Why should we create differences in the name of Telugu/Tamil/Kannadiga/Mallu?
      Mr. అజ్ఞాత, if you are trying to create difference in the name of language, you are no different than KCR, who insulted Telugu Talli.

      తొలగించండి
    2. తమిళ ద్రవిడ నాయకులు చాలా ఏళ్లు భారతీయులమనుకోలేదు. రామస్వామి పెరియార్ ఒక బ్రిటిష్ ఏజెంట్ ఉండేవాడు. అతను ఒకప్పుడు ద్రవిడ ఉద్యమం అని మొదలుపెట్టాడు. ఆయన అనుచర వర్గమే ద్రవిడ పార్టి గా ఇప్పటికి కొనసాగుతున్నారు. బ్రిటీషోడు వాడుకొన్నానాళ్ళు పెరియార్ ని వాడుకొన్నాడు. దేశ విభజన పై స్పష్టత వచ్చిన తరువాత, పెరియార్ కి చేయి ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టి ని దుమ్మెత్తిపోస్తూ రాజకీయ కెరీర్ ఏర్పరచుకొన్న పెరియార్ కి, కాంగ్రెస్ నాయకత్వంలోకి దేశం వెళిపోతుంటె భయం పుట్టింది. బ్రిటీష్ వాళ్ళు వెళ్ళిన తరువాత కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కక్ష తీర్చుకొంటారేమో అని. ఆ భయంతో పాకిస్థాన్ తీసుకొని జిన్నా పోతూంటే , మేము మీతో కలుస్తామని ఆయన వెనకాల పడ్డాడు. పోరాపుల్లాయ్ అని పెరియార్ కి, టాటా చెప్పి జిన్నా పాకిస్థాన్ కి వెళ్ళాడు. రామస్వామి పెరియార్ ఏర్పాటుచేసిన ద్రవిడ పార్టిలు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా కొనసాగించారు. చైనా యుద్దం తరువాత ఆ నినాదం మానారు. నక్కజిత్తులు, పిరికి వాళ్లలో ద్రవిడ నాయకులు, వారి వారసులు అగ్రగణ్యులు. స్వాతంత్ర పోరాటాంలో వాళ్ల కాంట్రిబ్యుషన్ తెలుగువారితో పోలిస్తే చాలా తక్కువ. వీరి భాష పైత్యం ఇతరులను డామినేట్ చేయాలనే కోరిక బాగా అర్థమైన కన్నడ ప్రజలు బెంగుళూరు లో నేడు నోరు మెదిపితే ఉతికి పెట్టే వరకు వచ్చారు. ఎంతో సౌమ్యులైన కన్నడ ప్రజలకే కోపం తెప్పించిన వాళ్లు.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  5. భాషకతీతం గా నెల్లూరు అందరిదీ అయితే, ప్రాంతాల కతీతం గా హైదరాబాదూ, వరంగల్లూ, ఖమ్మమూ వగైరా వగైరా కూడా ఆంధ్రులవి. భాష ఎంత ఎంత గొప్పదో ప్రాంతం కూడా అంతే గొప్పది.

    రిప్లయితొలగించండి
  6. @Jai,
    నీ తొక్కలో లాజిక్ ప్రకారం హైదరాబాద్ హైదరాబాద్ వాళ్లది కాని ఎక్కడనుండో వచ్చిన దొర ది కాదు కదా!! తొక్కలో దొర ఎందుకు వెధవ లొల్లి పెడుతుండు, బిల్డింగ్స్ అమ్ముకు దొబ్బుడుకు? గంతెందుకు, ముందు నువ్వేడనుండి వచ్చినవో సెప్పు? హైదరాబాద్ నీదవుద్దా?

    రిప్లయితొలగించండి
  7. Jai, you started it with 'maadi'. Let it rest. Our state is Telangana, not TRS.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Our state is Telangana, not Andhra. Their state is Andhra, not Telangana. Does this make sense?

      The blogger wants both Telangana & Andhra for *all Telugus*. This is discrimination against non-Telugus.

      PS: I am not a TRS chamcha, why did you get this impression?

      తొలగించండి
    2. ==The blogger wants both Telangana & Andhra for *all Telugus*. This is discrimination against non-Telugus. ==
      1. You claim that the blogger wants both Andhra & Telangana for all Telugus.
      The blogger never claimed this either directly or indirectly.
      Even if there was a claim, just like we have Kannada speaking, Tamil speaking, Bhojpuri speaking, Bihari speaking, Marathi speaking states [and many more...], we have 2 states that speak Telugu. What is wrong in that?

      2. And where is the discrimination against non-Telugus in this blogpost?

      Finally, you are neither in Andhra state nor in Telangana state. You are in Moronic Mental state.

      తొలగించండి
    3. You Brainless Gottimukkala,

      How do you know 'their'state is Telangana? Answer this first, later you can try to exhibit your agenda openly.

      Finally, you are neither in Andhra state nor in Telangana state. You are in Moronic Mental state.
      ------------------
      @Agnata you summed very nicely about this TRS paid worker.

      తొలగించండి
  8. అందరినీ కలుపుకొని వెళదాం రండి. మీ వ్యాఖ్యానాలతో విశాల ధృక్పథ భావాలు వెలువరచినందుకు అందరికీ కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  9. "I am not a TRS chamcha, why did you get this impression?"
    You seem to focus on defending TRS even when they do something silly and lose credibility a lot of times. You & I argued once in one of the other blogs as well.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Please see my comment on Haribabu's blog (pasted below) & think again. I can't refer to past arguments because you choose to be anonymous (BTW too many Anons here too)

      http://harikaalam.blogspot.com/2015/01/blog-post_30.html?showComment=1422620362389#c6607855098014562165

      The Rajaiah episode could (should) have handled better. No doubt it is the CM's prerogative to decide the cabinet but the NTR shades leave a bitter taste.

      The other & deeper problem is the veil of secrecy around charges against Rajaiah. Why hide corruption allegations from the public?

      Moving the chest hospital away from the pollution of Erragadda is OK.There is no point however why the teaching hospital status should be risked. Better to find a more suitable location close to the new medical university or proposed AIIMS so that the affiliation can be transferred to this (of course after the new MU/AIIMS actually starts functioning).

      The shifting of secretariat, high court and various other offices to a new location makes no sense at all. Which citizen needs to visit two offices the same time? What about security with so many high risk people in the same location?

      Vastu, my left foot! Are we going to let this pseudo scientific nonsense dictate how the aspirations of people are going to be fulfilled? We did not fight for Telangana to enable this nonsensical approach.

      I thought of writing a blog post condemning the so called vastu based decisions. I held it off but wrote a stinker addressing various Telangana friends.

      Finally what will happen to the vacated buildings, many of which are in heritage structures?

      తొలగించండి
    2. So.. What are you trying to say by copy + Pasting job? Are your trying to prove your sanity?

      Well let us trust this for a while. Now tell me, why you started unnecessary discussion here? Do you think you are only one person authorized to comment on TRS government? No one else are supposed to do the same?

      So you are feeling like official spokes person for TRS on here on telugu blog world it seems.

      తొలగించండి
  10. Dear anons, getting personal is cheap. Grow up.

    రిప్లయితొలగించండి
  11. ఏం చేప్తిరి ఏం చెప్తిరి. కనపడ్డ ప్రతి బ్లాగులోనూ బోడి ఆంధ్రప్రదేశ్ అని 'కారు' కూతలు కూస్తూ పక్క రాష్ట్రం మీద నోటికొచ్చిన విషపు రాతలు రాసినప్పుడు తమరు ఎక్కడ చల్లగా పడుకుని ఉన్నారో. దొరగారిని ఒక్కమాట అనగానే తననే అన్నట్లు పీలయ్యే నువ్వెవ్వని అని విరుచుకుపడే కామెంట్లు తమ కంటికి కనపడటం లేదా? ఒక్కసారి పైన చదివితే తెలుస్తుంది తమరికి అచ్చోచిన ఊరి మీదకి వదిలిన ఆంబోతు లెక్క విరుచుకు పడతంది ఎవరో . కొద్దిగా ఆ కళ్ళజోడు సరిచేసుకుని చదువు మిత్రమా ఏది 'చీపో' కొద్దిగా బుర్రలోకి ఎక్కుద్ది.

    రిప్లయితొలగించండి

Add your comment here