రెండు రాజధానులొదిలాం, మన కష్టం ఒట్టిపోదు

కొంతమంది వెర్రి వెధవలు
ఫో అంటే
అధికార మదమెక్కిన
ఆంబోతులు సవాలు చేసి శివాలెత్తుతుంటే
మరి ఇంతమంది, కోట్లమంది ఏం పట్టనట్టు 
మనం వారికేం చెందనట్టు
మనల్ని ఎపుడూ ఎరగనట్టు
ఏదొ ఇంతకాలం బిచ్చమేసినట్టు
పీడ విరగడైనట్టు
ప్రవర్తిస్తున్న వీరితోనా మనం కలిసినడిచాం
వీరితోనా ఇన్ని తరాలు సోదరభావంతో మెలిగాం
స్వాభిమానం హద్దు మీరితే స్వార్థమే
ఆత్మాభిమానం తలవంచితే అవమానమే
కుళ్ళిన శవాల మధ్య నిదురిస్తే నీవూ శవమే
వారు క్రొత్త తల్లిని కనుగొన్నారు
విలక్షణంగా ఎదగాలనుకున్నారు
త్వరలో క్రొత భాషనూ కనిపెడతారు
మనమెవరో ఉనికే తెలియదంటారు
ఇంకా ఎందుకన్నా అలోచిస్తావు
ఏం మిగిలుందని వెనుతిరిగి చూస్తావ్?
స్నేహితులే శత్రువులై తరుముతుంటే
ఇంటికప్పే నీపై ఉరుముతుంటే
రెండు రాజధానులొదిలాం, మన కష్టం ఒట్టిపోదు
సున్నా నుండి మొదలు పెట్టడం మనకేం క్రొత్త కాదు
తెలుగు మహామహుల విగ్రహాల తలలే నరికారు
ఏదో పొట్ట చేతబట్టొచ్చిన గొట్టం సుబ్బడు నీవెంత
వారి సంస్కారం ముందు మనమెంత
మన నెత్తురు, మన చెమట ధారపోసిన నేల వదిలి
మనం ముందుకు సాగాలి
సొంత ఊరు పిలుస్తోంది రా కదిలి రా
నవ్యాంధ్ర ఉదయిస్తోంది రా రా

3 కామెంట్‌లు:

  1. కాకి గూడులో కోకిల పెరిగి పాటలు పాడినా కాకికి ఆనందం కలగకపోగా...కోకిల గొంతు వినగానే వెంటబడుతుంది...ఇప్పటికైనా రాజధానిని పొమ్మనటానికి వీలు లేని ప్రాంతాలు అయిన...కడప-ఒంగోలు-విజయవాడ-రాజమండ్రి ప్రాంతాలలో పెడితే బాగుంటుంది. .

    రిప్లయితొలగించండి
  2. gunde, kallu, chemarchai, gonthu muga boyindi.ontarithanam aavahinchindi.

    రిప్లయితొలగించండి

Add your comment here