ప్రజలకు జవాబుదారీ వ్యవస్థ,
అరవై యేండ్ల ప్రజాస్వామ్యం,
గొప్ప రాజ్యాంగం, చట్టాలు, సవరణలు,
ఉన్నత మహోన్నత ఆస్థానాలు,
ఎగువ దిగువ సభలూ
అన్నీ కలిసి
మనకూ మన భావితరాలకు
గొప్ప జీవితానుభవాన్నిచ్చారు
భవిష్యత్తులో మళ్ళీ
విభజన జరగాలంటే
ఎలా జరపా(గా)లో
ద్విగుణీకృత ఉత్సాహంతో
సోదాహరణంగా చేసి చూపించారు
దీనికి మిగతా వ్యవస్థలు సహకరించిన తీరు
సమర్థించిన తీరు మహాద్భుతం
కొసరి కొసరి వడ్డించిన వైనం అజరామరం
ఇలా జరుపవచ్చా?
ఇది వ్యవస్థ ధర్మానికి విరుద్ధం కాదా?
ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రశ్నార్థకం కాదా?
ఇది సమంజసమేనా ?
ఇది ఏమి ఉల్లంఘించకుండానే
ఏదీ అతిక్రమించకుండానే జరిగిందా?
ఈ విభజనకాండను పాఠ్యాంశాలుగా ప్రచురించండి
భావి భారత పౌరులు మన వ్యవస్థల గొప్పదనాన్ని
అవహగాహన చేసుకుంటారు
సాంప్రదాయాల్ని అందిబుచ్చుకుంటారు
ప్రపంచ దేశాలు మరో వింతగా వ్రాసుకుంటాయి
కారకులైన నాయకుల, వ్యవస్థ రక్షకుల
చిత్రాలు మన దేవాలయాల్లో బద్రం చేద్దాం
వారి త్యాగనిరతిని కథలు కథలుగా చెప్పుకుందాం
ఈ తీయని అనుభూతుల్ని పది కాలాలపాటు
పదిలంగా నెమరువేసుకుంటాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here