న్యాయ స్థానం ఏ-కేసి ఆరు-న్నొక్క రాగం తీయించినా
బుద్ధి రాని పాలకులు టపాకాయల్లా పేలుతున్నారు
వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారు
వారు క్రొత్త అర్థాలు వెదుక్కుంటూ
ప్రజలను ప్రక్క దారి పట్టించాలని చూస్తుంటే
ప్రజలు మాత్రం వీరి వెర్రి చేష్టలకి విరగబడి నవ్వుతున్నారు
చేస్తున్నది తప్పని తెలిసి మరీ త్రవ్వుకుంటే
తాము తీసిన గోతిలో తామే పడతామని రుజువు చేస్తున్నారు
ఎందుకర్రా విఱ్ఱవీగుతారు
ప్రజలను మరచి పాలన మరచి
మొండి పట్టుదలలు పొంతనలేని పౌరుషాలు చూపిస్తూ
ఎవరూ లేని చీకట్లో జబ్బలు చరుస్తారు
నీడలపై పోట్లాటలకు సిద్ధమౌతారు
నివురు గప్పిన నిప్పంటూ బూడిద మసి పూసుకుంటే సరిపోతుందా?
లోన విషయముండాలి కదా!?
కనకపు సింహాసనమున ...
చందం కాకుండా
కృషి ఉంటే మనుషులు...
అనిపించుకోండి
మాకు మార్గదర్శులు కండి
wisely said ...
రిప్లయితొలగించండిన్యాయ స్థానం (ఏ)కేసి ఆరు (న్నొక్క) రాగం తీయించినా ,
రిప్లయితొలగించండిబుద్ధి రాని పాలకులు టపాకాయల్లా పేలుతున్నారు ,
వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారు ,
క్రొత్త అర్థాలు వెదుక్కుంటూ ,
ప్రజలను ప్రక్క దారి పట్టించాలని చూస్తుంటే ,
ప్రజలు మాత్రం వీరి వెర్రి చేష్టలకి ,
విరగబడి నవ్వుతూనే వున్నారు .
తాము చేస్తున్నది తప్పని తెలిసి మరీ ,
త్రవ్వుకుంటూ
తాము తీసిన ఆ గోతిలో తామే పడదామని ,
ఋజువు చేసుకుంటున్నారు .
ప్రజలను మరచి ,
పాలన మరచి ,
మొండి పట్టుదలలు ,
పొంతనలేని పౌరుషాలు చూపిస్తూ ,
ఎవరూ లేని చీకట్లో జబ్బలు చరుస్తుంటారు ,
నీడలపై పోట్లాటలకు సిద్ధమౌతుంటారు
ఎందుకో అలా విఱ్ఱవీగుతుంటారు ?
బూడిద పట్టుకొని నివురు గప్పిన నిప్పనగానే ,
నిప్పయిపోతుందా ?
లోన విషయముండాలి కదా !
కనకపు సింహాసనమున ,
శునకపు చందం కాకుండా ,
కృషి ఉంటే మనుషులు ,
ఋషులౌతారు అని గుర్తుచేసుకోండి ,
మాకు మార్గదర్శులు కండి .
శర్మ గారు, చాలా రోజుల తరువాత ఇప్పుడే చూశా. మీ కూర్పు తీర్పు బావుంది. ధన్యవాదాలు.
తొలగించండిVunna mata cheppaaru......
రిప్లయితొలగించండిVintunnavaa....gundumadhusuudanaa...
vintunnavaa gunduuuuu....madhusuuuu