నేనే ఒక పనిముట్టునై పదును తేలుతున్నా!

ఇనుప చట్రాలమధ్య చిక్కుకున్న ఒంటరి బానిసత్వం
ఎప్పుడో కడతేరిపోయింది
అంతః శత్రువుని శాశ్వతంగా సంహరించిన నాకు
క్రొత్త రెక్కలు ఎప్పుడొచ్చాయో తెలియదు
కోరినంత దూరం స్వెఛ్చా విహంగంలా ఎగిరిపోతున్నా
ఊహకందని తీరాలకు చేరుకుంటున్నా
వెలుగు కోరే చిరు ఆశల జాబితా 
పుటల క్రొద్దీ నిండిపోయింది
ఆత్మ విశ్వాసపు గొడ్డలి వ్రేటుతో
సోమరి సంకెళ్ళను తెగ నరికి
బద్దకపు పెనుభారాన్ని 
స్వేద శౌర్యానికి బలి ఇస్తున్నా! 
ఆరని ఆశయాల కొలిమిలో 
నేనే ఒక పనిముట్టునై పదును తేలుతున్నా!
ఎలుగెత్తిన వెలుగద్దిన నిలువెత్తు విజయాల 
సంతకం చేస్తున్నా!
అంతః శత్రువుని శాశ్వతంగా సంహరించి 
మున్ముందుకు దూసుకుపోతున్నా!!

4 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు, వాక్య క్రమాన్ని చక్కగా అమర్చారు. పదాలను సవరించారు.కృతఙ్ఞతలు

      తొలగించండి
  2. నేనే ఒక పనిముట్టునై పదును తేలుతున్నా!
    ఎలుగెత్తిన వెలుగద్దిన నిలువెత్తు విజయాల
    సంతకం చేస్తున్నా........,అద్భుతంగాఅ రాశారు, మార్పుకు నాంధీ. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి

Add your comment here