కూత పెడుతూ, నా గుండె కోత కోస్తూ
పట్టాలెంబడి తనకేమి పట్టనట్టు
చలి గాలిని చీల్చుకుంటూ
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది
ఇప్పుడే రాములోరి గుడి దాటి
చదూకున్న బడి దాటి
ఊరి చివరి నారు మళ్ళు దాటి
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది
బరువెక్కిన గుండెతో
ఎరుపెక్కిన కళ్ళతో
తల్లడిల్లే మనసుతో
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది
వయసుడిగిన అమ్మ నాయనలనొదిలి
ఎంటబడి వచ్చే నేస్తగాళ్ళనొదిలి
మాటిచ్చిన మగువనొదిలి
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది
పంట చేలు నీరందక ఎండిపాయ
రాదారి పనులు డబ్బులందకనేపాయ
రాయి గనులు రాజకీయాలతో మూతబడిపాయ
పొయ్యిలో పిల్లి లేవకపాయ
ఆకలి తీర్చ గతి లేక
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది
ఎద్దులు ఎంకటేసుకు మరుగుతాయోలెదో
అమ్మ ఇదు మైళ్ళు బోయి పాలు అమ్ముకొస్తాదోలేదో
నాయిన కొండ మీద కట్టెలు మోసుకొస్తాడోలెదో
కష్టాలు తీరుస్తానని మాటిచ్చి
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది
శానా బరువబ్బా ఈ బాద
గుండె పగల గొట్టినట్టు
రంపంతో కోసినట్టు
రగతమేదో పీల్చినట్టు
నేనిక్కిన పొగబండి ఊరొదిలిపోతున్నాది
నెనెక్కిన పొగబండి ఊరొదలి పోతున్నాది
రిప్లయితొలగించండినావాళ్ళందరిలో ఎన్నెన్నో ఆశల ఊసులు రేపినాది .
జరుగుతుందో లేదో కాలనికే వదిలేసి
నెనెక్కిన పొగబండి ఊరొదలి పోతున్నాది
అది పొగబండి కానే కాదు ఎందరిలోనో ఆశలు రేపిన ఆశల బండి .
జీవితం యిలాగే సాగిపోతుంటుంది చాలామందికి .
చాలా చాలా బాగుంది .
శర్మ గారు, ధన్యవాదాలు
తొలగించండిఅద్భుతం,అనితర సాద్యం ఎన్నిసార్లు చదివానో
రిప్లయితొలగించండిఫాతిమా గారు, మీ అభినందనలు ఎంతో ఆనందం కల్గించాయి. ధన్యవాదాలు
తొలగించండి