ప్రతి అంశానికి, ప్రతి నిముషానికి తెలంగాణ ముడిపెట్టి
ఎదుటివారిని భయపెట్టి, బెదరగొట్టి
రోజులు గడిపేద్దామని అనుకుంటివా?
నీ ఒక్కడిసొత్తుగాదు తెలంగాణ
అత్మాహుతి చేసుకున్న అమరుల నెత్తుటిచుక్కలతో
పుట్టింది తెలంగాణ
కష్టాలకోర్చి కన్నీళ్ళకోర్చి పోరాడిన
వీరుల సొంతం తెలంగాణ
అధికారం కోసం, బంధుప్రీతి కోసం
మొగ్గ తొడగలేదు తెలంగాణ
వంగితే....తెలంగాణను అవమానపరచినట్లే
లేస్తే.....తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టినట్లే
తుమ్మితే....తెలంగాణ పైన కుట్ర పన్నినట్లే
ఎవరైనా నిన్ను విమర్శిస్తే...తెలంగాణ బిడ్డ కానట్లే
ఎందుకు విషపు చుక్కలు కలుపుతావు?
ఎందుకు కలుపు మొక్కలు ఇంకా నాటుతావు?
ఎన్నాళ్ళు ప్రజలను తెలంగాణ బూచి చూపెట్టి తప్పుదారి పట్టిస్తావు
ఎవరి నోటా మాట పెగలకుండా మాంఛి మంత్రమనుకొంటివా-తెలంగాణ బూచీ
మళ్ళీ మళ్ళీ భయపెడితే పిల్లికూడ భయపడదు -తెలంగాణ బూచీ
తెలంగాణ అభిమానం పొందేది ఇట్లగాదు -తెలంగాణ బూచీ
పాలనపై కళ్ళుపెట్టు పేదలకు కూడు బెట్టు, గూడు కట్టు
పంతాలకుపొయి వచ్చిన పని మరచిపోకు
పనికిమాలిన మాటలతో నోరు పారేసుకోకు
తెలంగాణ పాలించే అదృష్టం దక్కింది
దండం బెట్టు జనాలకి, దారి చూపు జనాలకి!!
Baagaa cheppaaru.subhaakaankshalu.......meetho paatu telangana prajalantha ee sangathi gurthinchhaali.
రిప్లయితొలగించండిeduti vaadi meeda visham chimmi pabba gadupukune paalakulaki
manchi budhi raavaali.
SENTIMENT ennaallo bathakadu.
చాలా బాగా చెప్పారు. ప్రతీదానికి తెలంగాణా ఆత్మగౌరవం అని పేరు పెట్టి తమ దాష్టీకాన్ని బాగా ప్రదర్శిస్తున్నారు. టివి9 కామెంట్ నాకు తెలిసి చాలామంది చూసి ఉండరు. అసలు ఆ వ్యాఖ్యలో తెలంగాణా ప్రజల ఆత్మగౌరవ సమస్య ఎక్కడుందో నాకెంతకీ అర్ధం గాలె.
రిప్లయితొలగించండిమిత్రమా !
రిప్లయితొలగించండిఎవరి మాట పెగలకుండా మంచి మంత్రమనుకున్నావా -తెలంగాణ బూచి
కంటే,
ఎవరి నోట మాట పెగలకుండా మాంఛి మంత్రమనుకొంటివా -తెలంగాణ బూచీ
అంటే బాగుంటుంది .
చిట్ట చివరగా నిజాలు దాగి వున్న ఖనిజాల్లాంటివి . అఫ్ఫుడప్పుడు బయట పడ్తుంటాయి . అవి చూచి ఆనందించేవారు కొందరు . అనుభవించేవారు ఇంకొందరు . ప్రోత్సహించేవారు మఱి కొందరు .
శర్మ గారు, కూర్పు చేశాను, మీ సవరణకు ధన్యవాదాలు.
తొలగించండివజ్రం లాంటి మాట చెప్పారు "నిజం-ఖనిజం"