భూమిలోకి తొక్కుతానంటరు
మెడలు విరిచేస్తానంటరు
జనాలను తరిమేస్తానంటరు
రెచ్చగొట్టే రోషం చూపిస్తరు
దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!
రైలు బండికి నిజాము పేరు పెట్టాలంట
పాఠంగా పిల్లలకూ చెప్పాలంట
నిజాము పాలనను తీసుకొస్తారంట
కాశ్మీరూ తెలంగాణ భారత్ లో లేవంట
దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!
నిజాము పాలనను మరిపిస్తూ ఇండ్లు పగలగొడితిరంట
జనాలు తిరగబడితే తోక ముడిచిపోతిరంట
మాధ్యమాలను మూయించి మొండిరాజులనిపిస్తిరంట
ఇల్లు ఇల్లంతా రాజులూ మంత్రులై పదవులేమో పంచుకొంటిరంట
దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!
విమోచన దినము చేయకుండ అడ్డుబడితిరంట
గోలుకొండ కోట మీద,
ఏది!! మన గోలుకొండ కోట మీద జాతీయ జెండ ఎగిరేయకంటిరంట
దొర నైజము చూచితివా ఓ బిడ్డా!
బండెనక బండ్లుగట్టి...అంటూ మళ్ళీ పాడాలంటావా ఓ బిడ్డా!!
ఇకనైనా ఏలుకోండి ప్రక్క రాష్ట్రం మీద పడి ఏడవకుండా.....
రిప్లయితొలగించండిneeku mundhu vartinchelaa chusuko.
Meedia anna maatalu sarigaa unnaya.. anni matalu anna meeku roshamu lekapovachhu .. kaani maaku undhi.
తొలగించండిమిత్రమా
మాధ్యమాలు చేసింది చాలా తప్పు, కాని క్షమాపణ అడిగినపుడు పెద్ద మనసుతో క్షమించగలగాలి. అదే నాయకుల
లక్షణం. శాశ్వతంగా ఆపగలమా మాధ్యమాల్ని?. నాయకులు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు మనల్ని.
పోతే..."ఇకనైన ఏలుకొండి..." స్వార్థ రాజకీయ నాయకులనుద్దేశించి వ్రాసింది. మీరు సంధర్భము అర్థం చేసుకోగల సమర్థులు.
నా కవితలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు తప్పక తెలుపుతూ ఉండండి. తెలుగు వారు ఎక్కడున్నా మనవారే
ante punishment unda kudadhaa..... edina chinna punishment isthene mali futures lo evvaru aa thappulu cheyyaru.... lifelong banned ani emi cheyyaledhu kadhaa.....
రిప్లయితొలగించండిila kshaminchukuntu pothe ela??
nenu naa notikichinadanthaa vaagesi kshaminchadi ani anesthaanu...
మిత్రమా,
తొలగించండితప్పుకు శిక్ష తప్పదు. మీ ఆవేశం అర్థంచేసుకోగలను. అధికారంతో మూయించేయకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చు.అదే భావితరాలకూ మార్గదర్శకమైన నాయకత్వం.
ఛాలా చక్కటి చిక్కటి నిజాలని చేజిక్కించుకొన్నావు .
రిప్లయితొలగించండిప్రతి లైను చివర ఈ చిన్న చిన్న మార్పులతో మరింత ఘనంగా వుంటుందీ రచన .
కొంచెం పరికించి చూడు మిత్రమా !
భూమిలోకి తొక్కుతానంటరు
మెడలు విరిచేస్తానంటరు
జనాలను తరిమేస్తానంటరు
రెచ్చగొట్టే రోషం చూపిస్తరు
దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!
రైలు బండికి నిజాము పేరు పెట్టాలంట
పాఠంగా పిల్లలకూ చెప్పాలంట
నిజాము పాలనను తీసుకొస్తారంట
కాశ్మీరూ తెలంగాణ భారత్ లో లేవంట
దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!
నిజాము పాలనను మరిపిస్తూ ఇండ్లు పడగొట్టారంట
జనాలు తిరగబడితే తోక ముడిచిపోతిరంట
మాధ్యమాలను మూయించి మొండిరాజులనిపీంచుకొంటిరంట
ఇల్లు ఇల్లంతా రాజులూ మంత్రులై పదవులేమో పంచుకొంటిరంట
దొర నైజము చూచితివా ఓ బిడ్డా!!
విమోచన దినము చేయకుండ అడ్డుబడితిరంట
గోలుకొండ కోట మీద, ఏదీ !
మన గోలుకొండ కోట మీద జాతీయ జెండ ఎగిరేయద్దంటిరంట
దొర నైజము చూచితివా ఓ బిడ్డా!
బండెనక బండ్లుగట్టి...అంటూ ,
మళ్ళీ మళ్ళీ పాడక తప్పదంటావా ఓ బిడ్డా!!
శర్మ గారు, ధన్యవాదాలు, మార్పులు చేశాను
తొలగించండి