పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?


కోట్లంటావు కోతలు లేవంటావు
నడివీధిలో నిలిపారంటావు
నీళ్ళిస్తానంటావు 
నిధులెక్కడ కాస్త చూపించు బాబూ
పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?

అదిగో ఓడరేవులంటావు
ఇదిగో విమానాశ్రయమంటావు
కేంద్ర అనుమతులెక్కడ బాబూ
పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?

రైతు రాజ్యమంటావు
ఋణ మోక్షమంటావు
మహిళా ఋణాలంటావు
రూపాయలు చూపించు బాబూ
పధకాలు సరే, పని జరిగిందెక్కడ బాబూ?

ఒక పధకమైనా ప్రజలకందేలా చూడు
వేయికళ్ళతో ఎదురుచూచు ప్రజలమధ్యకొచ్చి చూడు
పధకాలు ప్రవేశపెట్టడం గొప్ప కాదు
ప్రజలకందేవరకూ ఇచ్చిన మాట నిజం కాదు

3 కామెంట్‌లు:

  1. చివరి నాలుగు లైనులు ప్రజానాయకులందరికీ వర్తించేవి . వాళ్ళు ఒక్కమారు కాదు , పలుమార్లు ఆలోచించవలసి అమలు జరపాల్సినవే .

    రిప్లయితొలగించండి
  2. ఆ ప్రయత్నం లోనే ఐదేళ్ళు గడిచిపోతుంది

    రిప్లయితొలగించండి
  3. చుట్టూరా సినిమా జనాలూ
    సిగ్గులేక శతదినోత్సవాలూ

    ఇదేగా వందరోజుల సంబరం
    సరేలే బడాయి సంబడం

    రిప్లయితొలగించండి

Add your comment here