గోడు వినే నాథుడు లేక తెలుగు రాష్ట్రాలు వీధిన పడ్డాయి

మాటల మాంత్రికులు వెంకయ్య
చేతల శూన్య వీరులు మీరయ్య!
ఊరూర తిరిగి చేసిన వాగ్ధానాలు ఏమయ్యాయి?
ప్రజల మదిలో అలోచనలు రగిలించిన కూర్పులు
ప్రదానిని ఒప్పించడంలో ఎందుకు విఫలమయ్యాయి?
విభజనలో తెలివిగా పాలు పంచుకున్న మీవారి అతి తెలివితేటలు,
కోటలు దాటిన మాటలు, కట్టు కథలేనా??

విడగొట్టి, తెలుగు రాష్ట్రాల బలం పడగొట్టి
హస్తిన చుట్టూ తిరిగేలా
కేంద్రం ముందు మోకరిల్లేలా
ఎంత దుస్థితి కల్పించారు!!?
కల్పిత గాధలతో ప్రజలను మభ్యపెట్టారు
ఒకప్పుడు 42 సభ్యులతో ఉన్నతమైన స్థితి నుండి
ఇప్పుడు గోడు వినే నాథుడు లేక తెలుగు రాష్ట్రాలు వీధిన పడ్డాయి

చేతకాకపోతే త్రప్పుకోండి
ప్రజలను క్షమాపణలడగండి
మీ పై పై మాటల పూతలతో తెలుగు వారిని మభ్యపెట్టలేరు
రాజధాని లేని ఆంధ్ర, అభివృద్ధి లేని తెలంగాణ
మీ కుఠిల నీతికి నిలువెత్తు సాక్ష్యాలు

ఇప్పుడు కాలం మారింది, మీరింకా 5 ఏండ్ల భ్రమలో ఉన్నారేమో
జనాలు బట్టలిప్పికొడతారు జాగ్రత్త
మొండి చేతల మోడులను తరిమేస్తారు
బట్టల మీద పేర్లు వ్రాసుకునే పిచ్చి సన్నాసులని తరిమి కొడతారు
ప్రజలు అభివృద్దిని క్షణ క్షణం లెక్కిస్తున్నారు
ప్రసారాల మాధ్యమాలవారు మీ ప్రగల్భాల చరిత్రను కొలుస్తున్నారు
మీ ప్రణామాల ప్రమాణాలు నిప్పుతో కడుగుతున్నారు
అభివృద్ది పేరిట పరిశ్రమలకు దాసోహమంటే
ప్రజలు అభినందిస్తారనుకున్నావా?
పరిశ్రమలే ముఖ్యమనే మూర్ఖ భావనలతో
ప్రజలు హర్షించని సంస్కరణలు మీకు యమ పాశాలౌతాయి!!


11 కామెంట్‌లు:

  1. తెలంగాణా అభివృద్ధి గురించి బెంగ అక్కరలేదు. ఇన్నేళ్ళ తరువాత పరాయి పాలన నుండి విముక్తి దొరికింది కనుక మన వనరులు మనకే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారు,
      కేంద్రం సాయం చాలా విషయాల్లో అవసరం కదా, కాని వారివి మాటలే కాని చేతలు కాదు.
      ఉత్తర తెలంగాణ అభివృద్ది చెందాలి.

      తొలగించండి
    2. పరాయిపాలన?
      ఇక ఆంధ్రావాళ్ళు (నిజానికి ఆంధ్ర శబ్ధం తెలుగు భాషకు సంస్కృతనామం కాబట్టి అదేమీ దేశవాచకం కాదు) చూస్తే, తెలంగాణావారి ముఖ్యనగరానికి షోకులద్దటానికే తమ శ్రమనూ వనరులనూ వెచ్చించి మోసపోయామని బాధపడుతున్నారు. ఒకరకంగా వారికీ విముక్తి దొరికిందనే అనుకోవచ్చునేమో.

      ఇలా మనలో మనం పరస్పరం పరాయివాళ్ళం అనుకుంటూ అనుకుంటూ పోవటం ఉందే, అది ఉన్న విదేషాగ్నులని పెంచటమూ లేని కొత్తకొత్త విద్వేషాంకురాలను మొలకలెత్తించటమూ అనే మహత్తరదుష్కార్యానికే పనికి వస్తుంది కాని ఏ విధమైన నిర్మాణాత్మకమైన ప్రయోజనాన్నీ సిధ్ధింపజేస్తుందని అనుకోను.

      విజ్ఞ్జులు మీరూ 'పరాయి' అన్న మాట వాడటం విచారం కలిగించింది. ఒక్క సంగతి మరచిపోకండి, అన్ని కేంద్రప్రభుత్వాలూ 'అందరు తెలుగువాళ్ళనీ' ఎప్పుడూ 'పరాయివాళ్ళలాగే' చూసినది మాత్రం నిష్ఠురసత్యం.

      తొలగించండి
    3. తెలంగాణా ముఖ్యనగరానికి ఆంధ్రుల పన్నులతో షోకులు అబ్బాయనడం వాస్తవం కాదు. ఈ మహానగరం కట్టిన పన్నులతో రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది.

      దీనికి నిదర్శనం చూద్దామా? స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 5వ స్థానంలో ఉన్న నగరం ఈనాడు 6వ స్థానానికి పడింది. కనీస గుర్తింపు కూడా లేని విశాఖ బెజవాడ ఇవ్వాళ దేశంలో ఇరవై పెద్ద నగరాల జాబితాలో వచ్చి చేరాయి.

      అంతెందుకు ఇవ్వాళ ఆంధ్రకు లోటు బడ్జెటు ఎందుకు వచ్చింది? ఇన్నేళ్ళకు మల్లె తెలంగాణా రాబడి ఆంద్ర ఖర్చులకు లేదు కనుకే జరగింది అనేది వాస్తవం కాదా?

      ఆంధ్రులు తమిళ నాడు, కర్నాటక, బీహార్ తో సహా 27 రాష్ట్రాలను ఆంధ్రులు పరాయి వారిగా భావించడం మానేసాక ఆ పదాన్ని ఆక్షేపించడం బాగుంటుంది. అత్యంత బీద రాష్ట్రాలకు మాని మాకు మాత్రం ప్రత్యెక ప్రతిపత్తి కావాలని అడగడం ఆ దిశగా పొడసూపడం లేదు.

      కేంద్రం ఇన్నేళ్ళు తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను విస్మరించి మమ్మల్ని అణగదొక్కింది నిజమే. అయినా మాకు ఈ దేశం మీద మక్కువ తగ్గలేదు, తగ్గదు కూడా.

      తొలగించండి
    4. నిజమే తెలంగాణా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి కానీ అతిపెద్ద అవరోధమయిన బలవంతపు ఉమ్మడి రాష్ట్రం తొలిగిపోయింది. పోతూ పోతూ పెట్టి పోయిన పోలవరం, ఉమ్మడి రాజధాని లాంటి చిక్కులతో పాటు నీళ్ళ పంపిణీ అవకతవకలు లాంటి ఇన్నేళ్ళ నిర్వాకం కొంతవరకు గుదిబండలు. వీటన్నిటిని చేదించే శక్తి ఉందనే నమ్మకం నాకుంది.

      తొలగించండి
    5. మీ బలమైన ప్రో-తెలంగాణా సెంటిమెంట్‍ను అర్థం చేసుకున్నాననే అనుకుంటున్నాను.

      ఉధ్యోగుల జీతాలకూ డబ్బుల్లేని ఆంధ్రా మీకు ధనికరాష్ట్రంగానే కనిపిస్తోందంటే అది దురదృష్టకరం.

      ఆంధ్రాకు ఎలాంటిసాయం అందటమూ మీకు సుతరామూ ఇష్టంలేదు. సంతోషం. మీలో ఆంధ్రాప్రాంతానికి ఎక్కడ సహాయం అందుతుందో అన్న భయమూ అనుమానమూ కనిపించటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికీ, మీరు సములనే నమ్ముతున్నాను

      దేశం మీద మక్కువ తగ్గుతుందా తగ్గదా వంటి ప్రస్తావనలకు మన చర్చలో ప్రాతిపదికలు ఎక్కడున్నాయో తెలియటం లేదు.

      తెలంగాణా ఎంతో అభివృధ్ధి చెందటం అభిలషణీయమే. కాదని ఎవరూ అనరు. అవకతవక విభజనలో అవకతవకలు కాక అర్థవంతమైన పరిస్థితులే అన్ని రంగాల్లోనూ ఉంటాయా చెప్పండి. అన్ని చిక్కులనూ ఛేదించే శక్తి మీరు పరాయివాళ్ళూ ఆంద్రులూ అని ఎవరిని దాదాపుగా వినీవినబడనిస్వరంతో కనీకనబడని అసహనంతో అంటున్నారో ఆ ఆంధ్రులకూ బ్రహ్మాండంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే అనుకుంటున్నాను.

      అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుంది. స్వల్పకాలావధిలో హెచుతగ్గులు కనిపించినా చివరకు దీర్ఘకాలికప్రాతిపదికమీద న్యాయం దొరికి తీరుతుంది. అందుచేత చింత అనవసరం.

      తొలగించండి
  2. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. నిజమే. మనం వ్రాసిన పదాల అల్లిక వేరైనా, భావాలు ఎకాభిప్రాయం తెలియచెస్తాయి. ధన్యవాదాలు. వివిధరూపాల్లో చెప్పినా గుండెలోని భావమొక్కటె "తెలుగు"
      పచ్చి నిజమొక్కెటే..."కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎదగనివ్వదు"

      తొలగించండి

Add your comment here