మర్మముందని మధించి
పదే పదే తలచి
పలుగు పెట్టి త్రవ్వి త్రవ్వి
పుట్టలోని పాములల్లె గుంపులుగా
విషపు అలోచనలు ఒలికి ఒలికి వెలికివచ్చి
నిదురింప మనసురాక
ప్రశాంతత తిరిగిరాక
గుండె వేగం పెరిగి
రక్తమంతా మరిగి
విసుగు విసనకఱ్ఱై విసురుతుంటే
ఊపిరి సలపని కోపమై మిగులుతుంది అపార్థం!!
నేరుగా ప్రశ్నించి అర్థమడిగితే
సూటిగా మసలుకుంటే
సమయం వ్యర్థం కానివ్వక
బంధం బరువవ్వక
అరోగ్యం సౌభాగ్యమై
మాయమౌతుంది అపార్థం!!
ఇది కవితలాగా లేదు హితబోద లా ఉంది, చాలా చక్కగా చెప్పారు సర్.
రిప్లయితొలగించండిఈ కవితను నేను గూగుల్ కి షేర్ చెయ్యనా సర్,
రిప్లయితొలగించండిఫాతిమా గారు,
తొలగించండిఅభినందనలే కవితాత్మకి స్పూర్తి. నిరభ్యంతరంగా ప్రచురించడి, మీరు అడగటం ఆనందదాయకం.
good one.
రిప్లయితొలగించండిరావు గారు, మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు
తొలగించండి