ఉదయం సాయంత్రంగా పరివర్తన చెందే వరకూ
జరిగే జీవన పోరాటంలో నేను ఒంటరిని
రాత్రి, ఉదయమయ్యేవరకూ
జరిగే మానసిక సంఘర్షణలో నేను ఒంటరిని
శీతల ఉదయాల పొగ మంచు తగిలేవేళ
భావాలు పంచుకొనలేని నేను ఒంటరిని
యెదలోన బాదలముల్లు గ్రుచ్చుకునే వేళా
పంచుకునే హితులు లేని నేను ఒంటరిని
పుష్పవనాల మధ్య విహరిస్తూ
అనుభూతి పంచుకొనలేని నేను ఒంటరిని
కష్టాల కౌగిళ్ళలో ఊపిరాడక ఆర్తనాదాలు
చేయ పేరు పెగలని నేను ఒంటరిని
ప్రతిరోజూ ఎవరూ వ్రాయని ఉత్తరానికై
ఎదురుచూసే నేను ఒంటరిని
సాగిపోయే దారి వెంబడి ఒక పలుకరింపుకై
ఎదురుచూసే నేను ఒంటరిని
కథలు చదువుతూ నా కలలు
నిజమైతాయనుకునే నేను ఒంటరిని
రోజొక క్రొత్త ముసుగుతో
పరిచయాలకై కాపు కాసే నేను ఒంటరిని
వేలం పాటలో ఒంటరితనాన్ని
వెలకట్టకుండానే దక్కించుకున్న నేను, ఒంటరిని
ఒంటరితనానికే విసుగు పుట్టించ సత్తాగల
ఏకైక ఒంటరిని
అపుడే మొదలైన ప్రయాణంలో ఒంటరిలా,
ఎపుడూ అదే అనుభవం విధిర్లిఖితంలా అనుభవిస్తూన్న
నేను ఒంటరిని
పరిచయం పాదుకోకనే,
స్నేహం చివురులు తొడగకనే
ఒంటరితనపు విజయబావుట ఎగురవేసే
నే ఒంటరిని
ఒక క్రొత్త తోడు దొరుకుతుందనే ఆశలో
మిగిలే నే ఒంటరిని
బూజు భావాల గాజు కన్నుల పాషాణ హృదయాల
పసిడి మనుషుల మధ్య
నేను ఒంటరిని
చేతులు మాత్రమే కలిసి
చేతలు కలవని జన జీవనంలో నేనొంటరిని
మానవ సంబంధాల మధ్య
నిలువెత్తు గోడలు నిర్మించుకుని ఒంటరితనాన్ని
రాశులలో కొనుగోలుచేస్తున్న వారిని చూస్తే
నేను నిజంగా ఒంటరిని!!
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిశర్మ గారు, మీరు ఇస్తున్న సవరణలతో నేను నేర్చుకుంటున్నది చాలా ఉంది. మీకు నా మనస్పూర్వక ధన్యవాదాలు. "పరివర్తన, పెగలని, సత్తా" వంటి పదాలు నా కవిత సొగసును ఇనుమడించాయి. పై కవితని సవరణలతో తిరిగి ప్రచురించాను. మీ సవరణలు ఇక్కడి నుండి తొలగించాను, క్షమించాలి
తొలగించండిసవరణలను తొలగించినందులకు నేనేమీ అనుకోను సుమా !
తొలగించండిసవరించుకొన్నందులకు సంతోషం .
కవిత చాలా బాగుంది, శర్మగారి సవరణలు మనకు మంచి మార్గాలే,
రిప్లయితొలగించండిఅనుసరించిన మీకు ధన్యవాదాలు
మీ అబినందనకు సంతోషం. అవును శర్మ గారు చక్కటి మార్గ దర్శకులు
రిప్లయితొలగించండి