స్వార్థ ప్రాంతీయవాద కరాళ నృత్యం ఇక కొనసాగుతూనే వుంటుంది

విద్యుత్ వాటా వివాదాలు వైరుద్ధ్యం సృష్టిస్తుంటే
జల జగడాలు జనాల సిగపట్లకు దారి తీస్తుంటే
విద్యార్థుల భవితకి స్థానికత క్రొత్త శత్రువై భయపెడుతుంటే
ప్రభుత్వమొసగిన భూములన్నీ మీవి కావు పొమ్మంటూ
కార్యాలయాలమధ్య కంచెలు బిగించారు
చీకటి క్రమ్ముకొన్న బంధాలు
తూటాలు ప్రేల్చుకుంటున్న ప్రభుతలు
భూమి తడిబారని, గొంతు తడియారిన వైపరీత్యాలు
తేది దాటి పుడితే  నీది ఈ రాష్ట్రం కాదు 
ఇప్పటిదాకా అటువైపున్న వాడు, అరవై అనగానే ఇటువైపంటున్నాడు
ఎవరీ అద్భుత కళాకారులు
ఎక్కడి జగన్నాటకమిది  
ఎవరి వ్యూహమై నడచిన కుఠిల సంగ్రామమిది
ఎవరు కోరిన అధికారకాంక్షా విజయమిది
బలమైన రాజ్యపు పునాదుల్ని పెకలించగలిగిన
స్వార్థ ప్రాంతీయవాద కరాళ నృత్యం ఇక కొనసాగుతూనే వుంటుంది
ఆరని చిచ్చులు ఉచ్చులై స్నేహం ప్రేమలను ఉరివేస్తూ
శాశ్వత శత్రుత్వం దుర్భేధ్యమైన కుఢ్యమై విడదీస్తూ
విడిపోతే సర్దుకుంటుందనుకున్న అపార్థం 
ఇపుడర్థమేలేక అనర్థమై వ్యాపిస్తోంది
దాయాదుల తీరు - కత్తులు నూరుతున్న ఇరువైపుల జోరు
కనులు తెరిచేలోపలే ఈ దావానలం ఎన్ని అరాచకాలు సృష్టిస్తుందో
ఇది చలనంలేని మనం కాంచబోయే  చలన చిత్రం 
చిత్రమేంటంటే ఈ చలన చిత్రంలో మనం పాత్రధారులం
నిస్తేజపు జీవచ్ఛవ శిధిల సాక్ష్యాలం  

3 కామెంట్‌లు:

  1. బ్లాగ్ వేదికతో ఉన్న మీ అనుబంధానికి మేము చాలా సంతోషిస్తున్నాము.మీ బ్లాగులో బ్లాగ్ వేదిక లోగో ధరించి మద్దతు పలకవల్సిందిగా కోరుచున్నాము.
    ఇట్లు-బ్లాగ్ వేదిక టీం.

    http://blogvedika.blogspot.in/

    లంకె వేయుటకు:http://blogsvedika.blogspot.in/p/blog-page.html

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా,

    ఇప్పుడు నా blogu పై blog vedika logo లంకె వేశాను. ధన్యవాదములు

    -ఓచిన్నమాట

    రిప్లయితొలగించండి

Add your comment here