వానల్లు కురవాలి!! కరువు తీరేలా, కలలు పండేలా

తేలిపోయే మబ్బులు
తరిగిపోయిన వనాలు
ఎండుతున్న బావులు
నిప్పులు కక్కే గాలి
పురి విప్పని నెమలి
పెదవిప్పని కోకిల
పండకుండానే ఎండిన ఆకులు
ఎదగకుండానే ఆరిన మొలకలు
వాడిపోయిన ములగ చెట్టు
తడారిన పొలం గట్టు
బీటలు వారిన పంట భూమి
గుంటలు తేలిన ఆసామి
తెల్లబడిన కొండ వాలు
నెరెలీనిన చెరువు నేల
వన వేదన
మానవ రోదన
ఈ వ్యధలన్ని వెతలన్నీ
మట్టు వరకూ కొట్టుకు పోవాలంటే 
వానుల్లు కురవాలి!!
వరిచేలు పండాలి
నాగలి భుజానికెత్తి
నవ్వుకుంటూ రైతన్న
పొలం బాట పట్టాలి
పెదవి దాటిన
కూని రాగం ఉత్సాహం
నింపుతుంటే
పంట కాలువలలో
నీరు పారుతూ కమ్మని
శబ్దం చేస్తుంటే
పచ్చని పైరు చూసి
ఇంటిలక్ష్మి పదాలే అల్లుతూ
జానపదాలే పాడుతుంటే
చేతికొచ్చిన పంట
చూసి రైతు మురిసిపోతుంటే
వాన నీటిలో పిల్ల భడవలు
పడవలు వదులుతుంటే
వేకువెక్కని మబ్బులమాటున
వేడికక్కని సూరీడు
దోబూచులాడుతుంటే
ఉరకలేని మేకపిల్ల
పడిలేచి పరుగులెడుతుంటే
బడులవైపు చిన్నారులు
బారులు తీరిన కొంగలల్లే
గుంపులుగా కదులుతుంటే
పచ్చి గడ్డి పరమాన్నం
తిన్న ఆవు, దూడ పిల్లని
వొళ్ళంతా తడిపేస్తూ ముద్దాడుతుంటే
ఆ వేడుక  చూడాలి
వానల్లు కురవాలి!!
అందరి కలలూ పండాలి

7 కామెంట్‌లు:

  1. తప్పకుండా...మన కలలు పండుతాయి. రైతన్న ఎప్పటికీ అన్నదాతే.

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగ్ బాగుంది. ఈ రోజు చదువుతాను. మీ పేరు తెలిస్తే బాగుంటుంది సర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్యలు ఆనందం కలిగించాయి, ధన్యవాదాలు. నా పేరు నరసింహ

      తొలగించండి

  3. అడపా తడపా అనుకుంటుంటాం ఆ రోజులొచ్చేనా ? అని , మనం వింటామా అని , చూస్తామా అని .
    అదేమో గాని , యిప్పుడు మాత్రం చదువుతుంటేనే మనసు ఆనందడోలికలలో తేలియాడుతున్నది .
    ఈ రోజు తప్పక రావాలని , వస్తుందని ఆశిద్దాం .

    ఓ చిన్ని కరెక్షన్ సుమా !

    మానవ రోదన తర్వాత తదుపరి పద కూర్పుకి కొంచెం గ్యాప్ అత్యవసరం ఈ భావానికి . కొంచెం ఆలోచించి చూడండి .

    మొదటి రెండు లైనుల్లో ఒకే కూర్పుతో వెళ్తే ఇంకా బాగుండేది .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరందించిన సూచనలు బావున్నాయి, సవరించాను. మీతో పరిచయం కావడం సంతోషం.
      "ఓ ఛిన్నమాట"ను తప్పక చదివి మీ విలువైన సూచనలు అందిస్తూ ఉండండి.

      తొలగించండి

Add your comment here