జాతీయ క్రీడలు నిర్వహిస్తానంటావేం బాబూ?!

రుణభారం
తలసరి భారం
దాయాది వైరం 
తడిసి మోపెడౌతుంటే

రాజధాని లేని రాజ్యం
చట్ట సభలు లేని రాష్ట్రం
మన చేతుల్లో పెడుతుంటే
మనకు నీడలేక ఛస్తుంటే

నీటి కరువు
విద్యుత్తు బరువు
మనమీదపడి దరువేస్తుంటే

మొలకు కట్ట బట్ట లేదు
తలకు చుట్ట తుండుగుడ్డా లేదు
పలకబట్ట శక్తి లేదు
మమ్ము ఆటాడేస్తావా ఓ బాబూ!
జాతీయ క్రీడలు నిర్వహిస్తానంటావేం ఓ బాబూ?!

అది చేస్తావిదిచేస్తావని
పదేండ్ల తరువాత
పిలిచిమరీ పదవిస్తే
గొంతులో నీరు పోయక
పంతులోరికి దారి చూపక
ఆటలంటూ పాటలంటూ గంతులేద్దామంటవేం బాబూ!
జాతీయ క్రీడలు నిర్వహిస్తానంటావేం బాబూ?!

ఆసుపత్రి కట్టు
పేదలకిండ్లు కట్టు
కోట్లుపెట్టి మా నోరుగొట్టి ఏ ఆటాలాడబోకు
తెగువచూపు తెలుగోడివన్న పేరు చెడగొట్టుకోకు
పీడలన్ని ఒదిలాక క్రీడలెన్నొ ఆడొచ్చు
క్రినీడలను తొలగించి అంధ్రాను వెలిగించు
నవ్యాంధ్ర నిర్మాణం ఘనంగా నిర్వహించు ఓ బాబూ?!

5 కామెంట్‌లు:

  1. ఎవరినైనా మందలించదలచుకొన్నప్పూడు మర్యాదపూర్వకంగా మణ్దలించటం అందరి సంప్రదాయం .
    ఉదా: తప్పు చేసినా , మీకెందుకు శిక్షవేయకూడదో కోర్టువారికి 24 గంటల లోగా ఈ నోటీసుకి బదులీయవలసినదని మర్యాద పూర్వకంగా అడుగుతారు .

    చెప్పినదే అడుగడ్గున చెప్పటం కంటే , అరుదుగా చెప్తే చక్కగా వుంటుంది .
    ఉదా: అదే పనిగా పదే పదే చెప్పేవాళ్ళకు , అరుదుగ చెప్పే వాళ్ళకు వున్నంత తేడా .

    రుణభారం ,
    తలసరి భారం ,
    దాయాది వైరం ,
    తడిసి మోపెడౌతుంటే ,

    రాజధాని లేని రాజ్యం
    చట్ట సభలు లేని రాష్ట్రం
    మన చేతుల్లో పెడుతుంటే
    నిలువ నీడలేక ఛస్తుంటే ,

    నీటి కరువు ,
    విద్యుత్తు బరువు ,
    నిత్యావసరాల దరువు ,
    మనమీదపడి ఏకరువు పెడ్తుంటే ,

    మొలకు కట్ట బట్టా లేదు ,
    కడుపు నిండ తిండీ లేదు ,
    పలక పట్ట శక్తీ లేదు ,
    అఱక పట్ట యిఛ్ఛా లేకుండె ,

    అది చేస్తారు , యిదిచేస్తారని
    పదేండ్ల తరువాత పిలిచి మరీ పదవిచ్చాం ,
    గొంతులో నీరు పోయక,పంతులోరికి దారి చూపక ,
    ఆటలంటూ పాటలంటూ గంతులేద్దామంటారేం ,
    జాతీయ క్రీడలు నిర్వహిస్తానంటారేం బాబూ!

    కోట్లుపెట్టి మా నోళ్ళుగొట్టి ,ఆటాలాడించకండేం ,
    క్రీడలెన్నైనా ఆడొచ్చండి , పై పీడలన్ని వదిలాక ,
    క్రినీడలను తొలగించండి , అంధ్రాను వెలిగించండి ,
    నవ్యాంధ్ర నిర్మాణం ఘనంగా నిర్వహించండి .

    పేదలకిండ్లు కట్టించండి , ఆసుపత్రులు కట్టించండి ,
    నిరుద్యోగాన్ని నిర్మూలించండి ,
    తెలుగోడు తలెత్తుకునేటట్లు చెయ్యండి ,
    తెగువచూపు తెలుగోడివన్న పేరు తెచ్చుకోండి ,
    చరిత్రలో చిరస్థాయిగా వెలుగొందుదువు ఓ బాబూ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కవితను చంద్రబాబునాయుడు అతని మంత్రివర్గ సభ్యులు తప్పక చూడాలని కోరుకుంటున్నాను

      తొలగించండి
    2. శర్మ గారు, మీరు తిరిగి మలచిన విధానం చక్కగా ఉంది. నా అస్తిత్వం కోల్పోకుండా కొన్ని మార్పులు చేసాను :-). రాయలసీమ మాండలీకంలో "అండి, మీరు" కాకుండా ఏకవచనమే పరిపాటి. ఎంతటి వారినైనా "ఆన్న, అయ్యా" అంటూ ఏకవచనంతో సాగిపోతుంది.
      అందుకే అది మార్పు చేయదల్చుకోలేదు.

      తొలగించండి
  2. శర్మ గారు, మీ కవిత చాలా బాగుంది. ఆవేదన చూపిస్తూ అర్ధవంతంగా ఉంది. ప్రస్తుత పరిస్ధితుల మీద నేను చదివిన మంచి కవితల్లో ఇదొకటి.

    నాదొక సలహా. ఇలా బ్లాగుల్లో వ్రాస్తున్నారు బాగుంది, కాని బ్లాగులు చదివేవారు ఎంతమంది, ముఖ్యంగా రాజకీయనాయకులు ప్రభుత్వాధికార్లలో? అందుకని బ్లాగులతోపాటు ఈ కవితలు, వ్యాసాలు, అభిప్రాయాలు పత్రికలకి కూడా ప్రచురణార్ధం పంపిస్తే మరింత వెలుగులోకి వస్తాయి. ఆ విధంగా ప్రజల ఆవేదన ఆందోళనలు నాయకుల దృష్టికి వెడతాయని ఆశించవచ్చు. ఎవరి దృష్టికి వెళ్ళాలో వారి దృష్టికి వెళ్ళటం ముఖ్యం. పత్రికలకు కూడా పంపించటం, ప్రభుత్వ శాఖలకి / మంత్రులకి / ముఖ్యమంత్రికి ఈమెయిల్ ద్వారా కూడా తెలియపరచటం చేస్తే కొంతైనా చలనం రావచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నరసింహా రావు గారు .

      ఈ కవిత " ఓ చిన్నమాట " బ్లాగు ఆథర్ వ్రాసినది . నేను మీలా చదివి కొంచెం సవరించితే బాగుంటుందని సవరించ చేసిన ప్రయత్నమే యిది .
      మంచి కవితలు , రచనలు ఎవరు వ్రాసినా ప్రముఖ పత్రికలకు పంపాలన్న ఆలోచన ఈ పేరుపొందని రచయితలకు రాదు . ఎందుకంటే ఏ ప్రముఖ పత్రికలు ప్రచురించరు . నూటికో , కోటికో అన్నట్లు వాళ్ళు ప్రచురిస్తుంటారు . ఆ నూరులో , కోటిలో వీళ్ళుంటారని యిసుమంతైనా నమ్మకం లేకనే యిలాంటి బ్లాగులు పుట్టుకొస్తున్నాయి .

      మఱి వాళ్ళకు తెలిసేదెట్లా అన్న సందేహం కలగవచ్చు .
      వాళ్ళకు తెలియకనే చేయటం లేదు అనుకోవద్దు . వాళ్ళ దృష్టికి వచ్చినా ప్రయోజనం శూన్యమే .
      కాకుంటే కొంచెం నిజాన్ని కోరుకొనే వాళ్ళు యిలాంటివి చదివి ఉపశమనం పొందుతారని .
      వ్రాసేవాళ్ళు కూడా వాళ్ళ బాధను యిలా వెళ్ళగక్కుకుంటున్నారు .
      పోలీస్ , బ్రోతల్ ,
      వ్యాపరస్తులు , కొనుగోలుదారులు
      అబధ్ధాలతో జీవనగమనం ముందుకు సాగిపోతూ వుంటుంది .
      అంతేనండి .

      తొలగించండి

Add your comment here