పోలవరం కథ, స్థానికత కాదేదీ వివాదానికనర్హమంటూ

భావి పౌరుల భవితతోనా  ఆటలాడుతున్నావు?
తెలుగు బిడ్డల వెలుగుపైనా అడ్డం పడుతున్నావు?
ప్రవేశ సమయం మించి పోతున్నా మిన్నకున్నావు
నీ దారి నీదే నంటూ మొండికేసుకున్నావు
ఒక్కసారి అందలమెక్కా ఇంత విఱ్ఱవీగుతున్నావు?
వాహన పన్నంటూ చట్టం తీసుకోస్తే
న్యాయస్థానం మొట్టికాయలేసింది
ఉద్యమాల పేరు చెప్పి ఎన్నాళ్ళు తలలూపమంటావు
తగవుపెట్టి తెగదెంపులుచేసి తలుగందుకున్నావు
సొంత రాష్ట్రం సంతలాగ తయారౌతుంటే
ఎవరిపై ఉద్యమాలు చేయాలో తెలియక అనుచరులు వెర్రిమొహాలేస్తున్నారు
ప్రతి విషయం రాద్ధాంతం చేసి, శత్రుత్వం రగిలించి
పోలవరం కథ, స్థానికత కాదేదీ వివాదానికనర్హమంటూ
లక్ష మార్గాల్లో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నావు
పాలనంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదు
పాలనంటే ప్రక్క రాష్ట్రం మీద పడి ఏడవడం కాదు
పాలనంటే ప్రజలపైన దండెత్తడం కాదు
పాలనంటే నియంతృత్వ నిరంకుశ ధోరణి కాదు

4 కామెంట్‌లు:

  1. దీని అర్ధం ఒక్క మారు పరిశీలించు .

    తగవుపెట్టి తెగదెంపులుచేసి తలుగందుకున్నావు ,

    పాలనంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదు
    పాలనంటే ప్రక్క రాష్ట్రం మీద పడి ఏడవడం కాదు
    పాలనంటే ప్రజలపైన దండెత్తడం కాదు
    పాలనంటే నియంతృత్వ నిరంకుశ ధోరణి కాదు

    మఱి ఏమిటో చెప్తే బాగుంటుంది కదా!

    రిప్లయితొలగించండి
  2. శర్మ గారు
    తలుగు - పశువుమెడకి కట్టిన తాడు.

    ఎందుకు పాలన కాదో ప్రస్తావించాను మరియు పాలన గురించి మనం చెప్పనవసరం లేదని :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అర్ధం తెలియచేసినందులకు థాంక్స్ .

      ఈ ప్రపంచంలో బాగా లేదని చెప్పేవాళ్ళు చాలా మంది వుంటారు . అది చాలా తేలికైన పని .
      ఎలా వుండాలో , ఎలా వుంటే బాగుంటుందో చెప్పేవాళ్ళే బహు అరుదు . అందుకని చెప్తే చాలా బాగుంటుంది .

      తొలగించండి
    2. శర్మ గారు, మీరు చెప్పింది నిజమే. తప్పకుండా వ్రాయటానికి ప్రయత్నిస్తా

      తొలగించండి

Add your comment here