మూడు వన్నెల జండా ఎగురవేసినప్పుడు
 ఉద్వేగంగా వుంటుంది
భారతీయుడినైనందుకు గర్వంగా వుంటుంది
దేశం కోసం ఏదైనా చేయాలన్పిస్తుంది
కాని అది ఆ  ఒక్క  క్షణమే
ఆలోచనలన్నీ  మారిపోయే  మరు నిమిషమే
దేశం కోసం సమయం  లేదు  కేటాయించడానికి
చలన చిత్రాలతో సరిపోయింది ఈ వారంతం మరి
బుల్లి  తెర  ధారావాహికలు
వార్తల పరంపరలు
అంతర్జాలం మహేంద్రజాలం
వేశాయి విలువైన కాలానికి గాలం
నాగరికత  చెదలు  పట్టింది
జీవిత  శైలి  భ్రస్టు  పట్టింది
త్రుప్పు పట్టిన ఈ మనిషి తీరు మారాలి
ఆకలి  చావులు  ఒక  వైపు
పుష్టి భోజనాలతో రోగిష్టులు మరో వైపు
బాలికా పసికందుల హత్యలు ఒక  వైపు
ఆడది ఆకాశం లో సగం అనడం మరో వైపు
పులుల సంరక్షణ కాంక్షిస్తారు కొందరు
పులులై జనం మీద ఎగబడతారు మరికొందరు
అవినీతి నిత్య హారతి భారత మాతకి
కుళ్ళు రాజకీయం మణిహారమయ్యింది భారతావనికి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Add your comment here