మాధ్యమాలను నియంత్రించి మూర్ఖుడివనిపించుకోకు

కత్తిపోటు ఒక ప్రాణాన్ని తీస్తే
కలంపోటు ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది
అధికార మదమెక్కి విర్రవీగి 
కలంపై కత్తులు దూస్తూ
వేల జీవితాలపై ఉక్కు పాదం పెడుతున్నావు

పదాల పొందికలే పదునైన ఆయుధాలుగా
నిత్య వార్తలతో పత్రికలతో ప్రజల నాడి ప్రతిస్పందనగా 
సామాన్యునికందుబాటుగా, తోడ్పాటుగా 
మాధ్యమాలు నిలిచినపుడు
గొంతునొక్కి, అణగద్రొక్కి, 
త్రొక్కిపట్టి వేడుక చూస్తున్నావు

ఎన్ని నాళ్ళు నీ ప్రస్థానం
ఇదు సంవత్సరాల ఆ స్థానం 
అందలం దిగకా మానదు
నషాళానికంటిన మత్తు దిగిరాకా మానదు
మాధ్యమాలను నియంత్రించి మూర్ఖుడివనిపించుకోకు

పాత్రికేయ మహాశక్తి మౌన ముద్రయై
అహింసా పోరాటమై
ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నా
పదునెంచని, పరికించని నీవు
ఒకనాడు పశ్చాత్తాప పడక తప్పదు

గళానికి, కలానికి సంకెళ్ళు వేసినపుడు
పత్రికా, మాధ్యమాల స్వేచ్ఛను హరించినపుడు
నీలాంటి నియంతలకు నిష్క్రమణ తప్పదు
తునకలుగా, పిడకలుగా
దొరికిపోయి, తరిగిపోయి, 
కరిగిపోయి, చెరిగిపోయి
వెనుదిరికి కనువెదకి చూస్తే
తెర మరుగై, కంపు మురుగై
చీకొట్టి, ఫోకొట్టి
పతనం కాక తప్పదు

5 కామెంట్‌లు:

  1. ఐదు ఏళ్లయినా వాడి ఆయుషుని వెచ్చించినా కలాన్ని ఆపేవాడు పుట్టలేదు.
    వాడి బెదిరింపులకు కొగే కట్టెతుపాకీ కాదు కలమంటే..(మీ కవిత చాలా అర్దవంతం గా ఉంది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫాతిమ గారు, ఆ నిజం మన తెలంగాణ బూచి కి తెలిసేదెప్పుడు...

      తొలగించండి
    2. @ochinnamaata..mee andhra chinnodiki telsinapudu ..;)

      తొలగించండి
    3. avunu KCR dora aandhra chinnoDu kaaka , telangaanaa chinnoDu eppuDayyaaDu?

      తొలగించండి
    4. renDu choTla different channels ni ban chesaaru yeppatiNuncho. Inthakee ee kavitha CBN kaa, KCR kaa ?

      తొలగించండి

Add your comment here