నోటిలో ముద్ద కడుపులోకి దిగాలంటే పన్ను కట్టాలా?

నోటిలో ముద్ద కడుపులోకి దిగాలంటే పన్ను కట్టాలా?
ఇంటిలోని వంటగదికి పోవాలంటే పన్ను కట్టాలా?
నిర్ణయించిన వారి పల్లు రాలగొట్టాలా?
కడుపు రగిలిపోతూంది వీరి పిచ్చి చేష్టలకి
గుండె మండిపొతూంది ఈ అసమర్థ విలువలకి

విభజించినప్పుడు అలోచించారా?
అయ్యా ఇష్టమొచ్చినట్లు విభజించారు
ఇబ్బందులున్నాయంటే ఆలకించారా?
కళ్ళు మూసుకుని పని చేస్తూ ప్రజల కడుపులు కొట్టారు
కన్నూ మిన్నూ గానక గురకలెట్టారు
రాజధాని పక్క రాష్ట్రంలో ఉంచేసి,
పోవాలంటే పన్ను కట్టాలి మరి!!
అది జగమెరిగిన సత్యం
పదేళ్ళ రాజధాని అవసరమా మరి?
ఇది విభజన గాయాల మహమ్మారి!
ఎవరు ఎవరా వెధవ నిర్ణయాల మార్గదర్శకులు
పని లేని శని గాళ్ళు పచ్చి మోసగాళ్ళు
విచక్షణలేని విషపు సర్పాలు
దూరదృష్టి లేని మంద బుద్ధులు
చదువుకోని వెర్రి నాగన్నలు సైతం విరగబడి నవ్వే
నిర్ణయాలు
దారీతెన్నూ లేని అడవిలో విడిచిపెట్టే గొప్ప సూత్రాలు

మూర్ఖుల ప్రకోపాలకు రాష్ట్రాలను బలియిస్తూ
చెదలు పట్టిన చదువులు చదివి చెత్త మనపై రుద్దేస్తూ
నోరు కుట్టేసి
చేసేదే చేస్తామంటూ
విభజించినదెవ్వరు?
 తలా తోకా లేని రాతలు రాసేదెవ్వరు?
వెనకుండి సమర్థించినదెవ్వరు?
ముందుండి దారిచూపినదెవ్వరు?
నిర్ణయాలు మురగబెట్టి పగబట్టిందెవ్వరు?
పదేళ్ళ రాజధాని అవసరమా మరి?
ఇంకా అచూరుకే పట్టుకు వ్రేళ్ళడటం అవసరమా మరి?

12 కామెంట్‌లు:

  1. Excerpt from my post

    http://jaigottimukkala.blogspot.in/2015/04/andhra-ruckus-on-telangana-road-tax.html

    "Even ignoring the above for a moment, let us consider the example of an individual living in Raichur. There is little or no chance for him to reach Bangalore (his "permanent" capital) just by sticking to Karnataka roads. Is he not paying tax to other state(s) just to reach his capital? How is the Andhra "my capital" sentiment superior to his?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారు,
      అవకాశం లేనప్పుడు సరే, మరి అదే పనిగా పన్ను కట్టవలసిరావడం ఎవరికైనా కష్టమే కదా. విభజించిన వారిని మాత్రమే ప్రశ్నించాను.

      -ఓచిన్నమాట

      తొలగించండి
    2. జైగారూ,

      కొన్ని కొన్ని సందర్భాల్లో దగ్గరదారి అనేది వేరేరాష్ట్రం గుండా పోయే‌పక్షంలో పడే పన్ను భారం ఒక యెత్తు. కాని ఇక్కడ ఆంధ్రజనం అందరూ ఎట్టిపరిస్థితిలోనూ తమ ప్రస్తుత దిక్కుమాలిన రాజధానికి రాకతప్పని పరిస్థితిలో పన్నుపేరిట వారు నిర్దాక్షిణ్యపు దారిదోపిడీ (ఈ దోపిడీ అనే పదం తెలంగాణావారి ముద్దుపదం కాబట్టి, ఇలాగంటే బాగా తెలుస్తుంది కాబట్టి వాడాను ఈ‌పదాన్ని) పాల బడటం వేరొక యెత్తూ కాదంటారా? మీరు కాదంటే కాదు అవునంటే అవునని ముందే వాదం విడిచేస్తున్నాను. సరే.

      ప్రపంచంలో ఆంధ్రప్రజలు పుట్టుదుష్టులు అన్నధోరణిలో ఆలోచించటం మానటం సముచితం అని సవినయంగా మీకూ,తెలంగాణావాదం పేరుతో విద్వేషవాదం చేసేవారికీ, ఈ తప్పుడు మాటలే నిజం అని భ్రమపడే సాధారణ తెలంగాణా ప్రజానీకానికీ మనవి చేస్తున్నాను. ఈ విద్వేషానికి అంతెక్కడ? ఆంధ్రజనం అంతా నశించిపోవాలన్న కోరికతో ఉన్నారా? అలాగే అనిపిస్తుంది అనేక సార్లు!

      తొలగించండి
    3. హైదరాబాదు తెలంగాణాకి చెందిన భూభాగం. దిక్కు మాలినది గానీ, దిక్సహితమైనది గానీ ఆంధ్రకు చెందిన ఎలాంటి రాజధాని అక్కడ లేదని గ్రహించాలి. పరిపాలన అవసరాలకోసం కొన్ని భవంతులను మాత్రమే కిరాయి లేకుండా వాడుకోవడం జరుగుతోంది. చంద్రబాబు గారు ఆ సింగపూరేదో త్వరగా కట్టేస్తే అప్పుడు వుంటుంది రాజధాని.

      తొలగించండి
    4. > హైదరాబాదు .... ఆంధ్రకు చెందిన ఎలాంటి రాజధాని అక్కడ లేదని గ్రహించాలి.

      హైదరాబాదు ఉభయరాష్ట్రప్రజలకు పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధాని అన్నారు. కాదా? విభజన చట్టాన్ని మీరు సవరించేసారా?

      తొలగించండి
    5. తెలంగాణా రాష్ట్రం ఆంధ్రులకు మాత్రమె (లేదా వైసీ వర్సా) పన్ను మినహాయించడం మిగిలిన 27 రాష్ట్రాలకు భారం కదా. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలంటే అందరినీ ఒకే రకంగా చూడాలి.

      ఆంద్ర నాయకత్వం పక్క రాష్ట్రంలో ఉండి పరిపాలన చేయడం అనేది (రెండు రాష్ట్రాల) ప్రజలకు కష్టమే. ఎంత త్వరగా రాజధాని తరలిస్తే అంత అందరికీ శ్రేయస్కరం. అయితే ఇది ఆంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని తెలంగాణకు ప్రమేయం లేదు.

      పూర్తిస్థాయి రాజధాని నిర్మాణానికి సమయం పట్టవచ్చు. కనీసం మంత్రులు, సెక్రెటేరియట్, ముఖ్య (రాష్ట్రస్థాయి) మంత్రాలాయాలు తాత్కాలికంగా బెజవాడ/గుంటూరులో మారిస్తే ప్రజలకు సదుపాయం.

      "హైదరాబాదు ఉభయరాష్ట్రప్రజలకు పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధాని అన్నారు. కాదా? విభజన చట్టాన్ని మీరు సవరించేసారా?"

      నా టపాలో పూర్తీ వివరాలు ఉన్నాయండీ.

      తొలగించండి
    6. 3. On and from the appointed day, there shall be formed a new State
      to be known as the State of Telangana comprising the following
      territories of the existing State of Andhra Pradesh, namely:-

      Adilabad, Karimnagar, Medak, Nizamabad, Warangal,
      Rangareddi, Nalgonda, Mahbubnagar, Khammam and Hyderabad
      districts, and thereupon the said territories shall cease to form part of the existing State of Andhra Pradesh.

      ఇదండీ సంగతి! ఆ తర్వాత ఆయా జిల్లాలకు ఆంప్రతో ఎలాంటి సంబంధమూ లేదన్న మాట! ఇక దీంతర్వాత హైదరాబాదును కామన్ క్యాపిటల్ గా ఉపయోగించుకోమన్నారు. ఉపయోగించుకోవడమంటే కేవలం వసతులు ఉపయోగించుకోవడంగా గుర్తించ గలరు. మీరు చట్టాలను సవరించేస్తానంటే చెప్పేదేమీ లేదు.

      ఒకవైపు లేనిదాన్ని ఉందని చెప్పజూడడమూ, రెండోవైపు ఇతరులను విద్వేషపరులుగా వర్ణించడమూ... తమరికే చెల్లిందని విన్నవించుకుంటున్నాను.

      తొలగించండి
    7. జై గారు,

      మీ రెండవ టపా చాల సమర్థనీయంగా ఉంది. అభినందనలు. ఒక్క మాట :తెలంగాణలో పన్ను మినహాయింపు అంధ్రాకు ఉండలాని చెప్పలేదు. రాజధానిగా పది సంవత్సరాలు ఉంటుందని చట్టం చేస్తున్నప్పుడు, ఇలాంటివి ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదన్నదే ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం విధించిన పన్నుని అన్ని రాష్ట్రాలమాదిరిగానే అహ్వానించవలసిందే.

      ఎవరు ఎంత కాదన్నా తెలుగువారు ఎక్కడున్నా మనవారే

      -ఓచిన్నమాట

      తొలగించండి
    8. అసలు ఈ పన్ను ఎందుకు తీసుకుంటున్నారో గమనిస్తే సమాధానం దొరుకుతుంది. పన్ను ద్వారా ముట్టిన రొక్కం ప్రయాణీకుల సౌకర్యార్ధం వాడుతారు. తెలంగాణతో సహా 28 రాష్ట్రాల ప్రజలు పన్ను కట్టి ఒక్క ఆంద్ర రాష్ట్రం వారే (షరా మామూలుగా వైసీ వర్సా) కట్టకపోతే వారికి ఫేవర్ చేసినట్టు అవుతుంది.

      ఆంద్ర నుండి ప్రభుత్వ కార్యాలయాలలో పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చే ప్రజల తాలూకా పన్ను ఆంద్ర ప్రభుత్వం రీ-ఇమ్బర్స్ చేస్తే వారికి భారం తగ్గుతుంది. లేదా తమ ప్రజల నుండి వసూల్ చేస్తున్న రవాణా పన్నులో కొంత శాతం (ఎంత అన్నది చర్చించాలి) తెలంగాణకు ఇచ్చినా చాలు.

      PS: ప్రయాణీకుల భాష అనవసరం అనుకుంటా. బళ్ళారి నుండి అనంతపురం వచ్చే తెలుగు వారు అప్పుడూ ఇప్పుడూ పన్నులు కడుతున్నారు.

      తొలగించండి
  2. Jai and sri kath

    You both support TRS like any thing ya.....

    రిప్లయితొలగించండి
  3. శ్రీకాంత్ గారు,

    పది సంవత్సరాలు రాజధానిగా ఉన్నపుడు రాకపోకలు సహజం. రాష్ట్ర రాజధానికి పోవడానికి పన్ను ఎందుకు కట్టాలి అన్నది విషయం. మీరు మరీ దూరం వెళ్ళిపోయి భూ భాగాలు, సాక్ష్యాలు, అధారాలు సమర్పించాల్సిన అవసరం లేదేమో....
    మీ స్వంత భావనలనుంచి బయటికిరండి.

    -ఓచిన్నమాట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ట్రక్కులు ప్రయాణీకుల కోసం కాదు. రైళ్లకు ఈ పన్ను భారం లేదు. ఆర్టీసీ విభజన ఇంకా కాలేదు. విభజన తరువాత కూడా పరస్పర ఒప్పందం ప్రకారం రూట్లు & సర్వీసులు పంచుకుంటే పన్నుల మినహాయింపు చేసుకోవొచ్చు.

      అంటే ఈ సమస్య కేవలం ప్రైవేటు బస్సులకు పరిమితం. అందులోనూ ఉద్యోగులు & వ్యాపారస్తులకు ఎటువంటి (వాళ్ళ ప్రయాణం రాజధాని కోసం కాదు కనుక) తేడా లేదు. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు చక్కదిద్దుకోవడానికి వచ్చే వారి సౌకర్యం కోసం "ప్రజల వద్దకు పాలన" అమలు చేయోచ్చు (ఉ. ఇంటర్నెట్/టెలిఫోన్ హెల్పులైన్).

      హైదరాబాద్-ఆంద్ర మధ్య రూట్లు అత్యంత లాభదాయకం. వాటిని రాజకీయ బలం కలిగిన ప్రైవేటు కంపనీలకు ఇచ్చే బదులు ఆర్టీసీ నడిపిస్తే బాగుండేది.

      తొలగించండి

Add your comment here